దెయ్యం పేరు వినగానే ఎవరికైనా భయం పుడుతుంది.అంతేకాదు ఓ చోట దెయ్యం ఉందని తెలిస్తే మళ్లీ ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేము.
ఇప్పటికీ దయ్యాలు ఉన్నాయి అంటే చాలామంది నమ్మరు.కానీ కొందరు మాత్రం దేవుడు ఉంటే దెయ్యం కూడా ఉన్నట్లే అని అంటుంటారు.
చదువుకోని వాళ్ళు కాకుండా చదువుకున్నవాళ్ళు కూడా దయ్యాన్ని ఉందని నమ్ముతుంటారు.
తాజాగా ఒక హాట్ హీరోయిన్ కూడా తల్లికి ఎదురైనా అనుభవాన్ని కూడా తెలిపింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా.
ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఇదిలా వుంటే ఇటీవలే జైపూర్ రాజవంశీకులురాలు రాజమాత పద్మిని దేవితో ముచ్చటించింది.
దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
అందులో ట్వింకిల్ తన తల్లి డింపుల్ కపాడియా గురించి కొన్ని విషయాలను బయటపెట్టింది.
గతంలో తన తల్లి జైపూర్ రాయల్ ప్యాలెస్ ను సందర్శించింది అని.ఆ రాజభవనంలో దయ్యం కనిపించింది అని తెలిపింది.పైగా ఆ దెయ్యం తో కాసేపు మాట్లాడిందని కూడా తెలిపింది.1990 లో లేఖిని అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి డింపుల్ వెళ్లిందని.దాంతో ఓ రాత్రంతా జైపూర్ ప్యాలెస్ లో గడిపింది అని తెలిపింది.

ఆ సమయంలో తన తల్లి పడుకున్న గదిలో ఆమె పక్కన ఓ మహిళ నిలబడి ఉందని.అది దెయ్యం అని తన తల్లి గుర్తించిందని.పైగా కాసేపు మాట్లాడిందని తెలిపింది.
దీంతో రాజమాత ఈ విషయం గురించి స్పందిస్తూ.అక్కడ ఎటువంటి దెయ్యాలు లేవని.
ఆమె ఆ సమయంలో దెయ్యం సినిమాలో నటిస్తుంది ఆ ప్రభావం తనమీద ఉందని.మానసిక బ్రాంతులకు కారణంగా ఆమె ఉదయం తో మాట్లాడినట్టు అనుభూతి చెందిందని తెలిపింది.
ఇక రోజంతా దెయ్యాల పాత్రలో నటించి దెయ్యం ఆలోచనలతో పడుకున్నావు కాబట్టి.నీకు దెయ్యం కనిపించినట్టు భ్రమ పడుతున్నావని నేరుగా అన్నానని తెలిపింది.

ఇక ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ డింపుల్ కపాడియా గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ఎక్కువగా హిందీ భాషలో నటించింది.అంతేకాకుండా తమిళ, మలయాళ భాషలో కూడా నటించింది.తన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.1973లో బాబి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డింపుల్ తొలి నటనకే మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించింది.
2015 వెల్ కమ్ బ్యాక్ సినిమాలో చివరి సారిగా నటించగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.ఇక ఈమె 1973లోనే సినీ నటుడు రాజేష్ ఖన్నా ను పెళ్లి చేసుకుంది.వీరికి ట్వింకిల్, రింకీ అనే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.ఈమె రాజేష్ కన్నా తో 1982లో విడిపోయింది.తన కూతురును కూడా నటులుగా చేసింది.
ఇక తన పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే
.