పవన్ కళ్యాణ్ ను నేను అలా పిలుస్తాను.. తారకరత్న షాకింగ్ కామెంట్స్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఒక సినిమాను మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నాయి.అయితే నందమూరి హీరో తారకత్న తాజాగా పవన్ కళ్యాణ్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Tarakaratna Shocking Comments About Pawan Kalyan Goes Viral In Social Media , P-TeluguStop.com

టీడీపీ జనసేన 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రచారం గురించి కూడా తారకరత్న స్పందించి కామెంట్లు చేశారు.

పవన్ ను తాను బాబాయ్ అని పిలుస్తానని మేము మెగా ఫ్యామిలీ సినిమాలను కూడా చూస్తానని తారకరత్న అన్నారు.పవన్ కళ్యాణ్ బలం పవన్ కు ఉందని ప్రజల కొరకు ఏదైనా చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తారకరత్న వెల్లడించారు.

జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తుల గురించి తాను మాట్లాడలేనని ఆయన చెప్పుకొచ్చారు.

జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే సీఎం ఎవరనే నిర్ణయం పొలిటికల్ గా తీసుకునే నిర్ణయం అని తారకరత్న కామెంట్లు చేశారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆ విషయాల గురించి మామయ్య నిర్ణయం తీసుకుంటారని తారకరత్న తెలిపారు.పాలిటిక్స్ గురించి తనకు కూడా ఆసక్తి ఉందని సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తానని తారకరత్న అన్నారు.

Telugu Bheemla Nayak, Pawan Kalyan, Tarakaratna-Movie

9 అవర్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న తారకరత్న ఈ విషయాలను వెల్లడించారు.9 అవర్స్ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.తారకరత్న కెరీర్ పరంగా మరెన్నో విజయాలను అందుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.హీరో తారకరత్న కెరీర్ లో సక్సెస్ లు ఎక్కువగా లేకపోయినా ఆయనకు సినిమా ఆఫర్లు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube