హైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటన దురదృష్టకరమని తెలిపారు.
వరుస ప్రమాదాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.అక్రమ భవనాల రెగ్యులరైజ్ పై ఉన్న దృష్టి ప్రమాదాల నివారణలో లేదని తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రాంతాలను మానిటరింగ్ చేయాలని చెప్పారు.పాత అపార్ట్ మెంట్లలో ప్రమాద నివారణకు కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు.







