వైభవంగా జరిగిన ఘట్టమనేని అభినవ కృష్ణ పంచల వేడుక!!

సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీ తులసి, ఉప్పలపాటి సూర్యనారాయణ బాబుల మనవడు చి.ఘట్టమనేని అభినవ కృష్ణ పంచల వేడుక కార్యక్రమం మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ ఎన్ సీసీ లో వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, డా.మోహన్ బాబు, కృష్ణంరాజు సతీమణి శ్యామల, ప్రముఖ దర్శకులు పి.సాంబశివరావు, సాగర్, ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్ జి .ఆదిశేషగిరిరావు, కెయస్ రామారావు, కె.యల్.నారాయణ, యస్.గోపాలరెడ్డి, యన్ రామలింగేశ్వరరావు, పద్మాలయ మల్లయ్య, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, తదితర ఆత్మీయ కుటుంబ సభ్యులు పాల్గొని చి.అభినవ్ కృష్ణను ఆశీర్వదించారు.

 Ghattamaneni Abhinava Krishna Panchala Veduka Celebrated Grandly Details, Ghatta-TeluguStop.com

ఇదే వేడుకపై సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకొని భారీగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు.

సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా బావమరిది అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు పద్మావతి ఫిలిమ్స్ పతాకంపై మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడి, రామ్ రాబర్ట్ రహీం, శంఖారావం, బజార్ రౌడి, వంటి చిత్రాలతో పాటు ఇంకా ఇరవై కి పైగా చిత్రాలను నిర్మించారు.అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తో హిందీలో రెండు, కన్నడలో అంబరీష్ తో రెండు చిత్రాలు నిర్మించారు.

ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల కొంత కాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న సూర్యనారాయణ బాబు త్వరలో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube