చుండూరు మండలం లోని చినగాదెలవర్రు, మోదుకురు అమృతలూరు మండలంలో ప్యాపర్రు, ఇంటూరు గ్రామాలలో చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలను పరిశీలించిన మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు గారు.వేమూరు నియోజకవర్గ పరిధలోని పలు మండలాలు, గ్రామాలలో విచ్చల విడిగా చెరువు లో మట్టి తవ్వకాలు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు .
టిడిపి – వైసిపి వర్గియుల మద్య వాగ్వీవాదం , తోపులాటలు, మాప్రభుత్వం , మా ఇష్టం అంటూ రెచ్చిపయిన వైసిపీ శ్రేణులు మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పరిశీలన చేసిన అనంతరం యధావిదిగా తవ్వకాలు .పోలీసుల పర్యవేక్షణ లో మట్టి తవ్వకాలు మంత్రి ఆదేశాల మేరకు మట్టి తవ్వకాలకు పోలీసులు రక్షణ ._మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు గారి పత్రికా ప్రకటన వివరాలు.చుండూరు మండలం చునగాదెలవర్రు,మోదుకూరు-మోపర్రు,కోయగుంట చెరువులో అమృతలూరు మండలం లోని ప్యాపర్రు,ఇంటూరు గ్రామాలలో జరుగుతున్న తవ్వకాలకు అనుమతులు లేవు .అయినా చెరువులో మట్టిని తవ్వి తరలిస్తున్నారు.అదేదో రహస్యంగా జరుగుతుందా అంటే అంతా బహిరంగంగానే, ఒకటి రెండు రోజులు.
కాదు.ఏకంగా 28 రోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ మట్టిని లారీలకు, ట్రాక్టర్లకు ఎత్తి తరలిస్తు న్నారు.
చెరువులో యదేచ్చగా మట్టి తవ్వకాలు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడలేదు.గ్రా మస్టులు ఫిర్యాదు చేసినా తమకు సంబంధం లేద అన్నట్లుగా ఉన్నారు.
అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిదులు అండతో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలకు తెగబడ్డారు.మోదుకూరు నుంచి నిత్యం వందల లారీలు, ట్రాక్టర్లు మట్టితో తరలిపోతున్నా అధికారు లు పట్టించుకున్న పాపానపోలేదు.
మోదుకూరు కోయగుంట చెరువులో తవ్వకాలకుఏ అనుమతులూ లేవని మైనింగ్ శాఖ అధికారులే చెబుతున్నారు .రూ.కోట్ల మట్టి మాయం అమృతలూరు మండలంలోని కొన్ని గ్రామాలకు లారీల్లో తరలిస్తున్నారన్నారు 15 నుంచి 20 అడుగుల లోతు వరకు తవ్వకాలు 26 రోజులుగా యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు*
గ్రామస్థుల ఫిర్యాదుతో మొక్కుబడి తనిఖీలకే మైనింగ్ శాఖ పరిమితం అక్రమ తవ్వకాలు పరిశీలించడానికి వెళితే అడ్డగోలుగా అడ్డుకుంటున్నారు.ఈ వైసీపీ నాయకులు ఏ విధమైన పర్మిషన్ ఉంది అని ఈ విధం గా అంత లోతు గా త్రవ్వి అమ్ముకుంటున్నారు? మంత్రి స్థాయి నుండి కింద స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ వాటాలు పంచుకుంటున్నారు.పెదగాదెలవర్రు లో 16 ఎకరాలు,మోపర్రు లో 16, ప్యాపర్రు లో 20 ఎకరాల చేరువులను విచ్చలవిడిగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.బాపట్ల జిల్లా కలెక్టర్ కి అంత తెలుసు కానీ తెలియనట్లు బెహేవ్ చేస్తున్నారు.
ఏ ఒక్క అధికారి ని వదిలి పెట్టె ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరి మీద ప్రైవేట్ కేసులు వేస్తాం.ఈ కార్యక్రమంలో వేమూరు నియోజక వర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







