నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.
లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు ఓ కేటుగాడు.
జిల్లాలో చిల్లర దొంగగా ఉన్న నరేశ్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సుమారు 50 మందికి పైగా నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్ష వరకూ వసూళ్లు చేశాడని సమాచారం.మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







