తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ అనే వ్యాధి నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే.
వైపు అందుకు సంబంధించిన చిపిస్తే తీసుకుంటూనే మరోవైపు జిమ్ లో కష్టపడుతూ తదుపరి సినిమా కోసం జిమ్ లో బాగానే ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ముద్దు ఒక సిటాడెల్ వెబ్ సిరీస్ అలాగే ఖుషి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది సమంత.

ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత మరో విషయంలో సోషల్ మీడియాలో నిలిచింది.టాలీవుడ్ ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి బర్త్డే సందర్భంగా ఆమెకు తన ఇంస్టాగ్రామ్ ద్వారా బర్త్డే విషెస్ ని తెలిపింది సమంత.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఈ విధంగా రాసుకొచ్చింది.
ఎంత బాధ ఉన్నా సరే దాన్ని దరిదాపుల్లోకి కూడా రానీయని నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి.బాధగా ఉండాల్సిన సందర్భంలోనూ నవ్విస్తావు.ఎప్పుడూ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తావు.నువ్వు లేకుండా నేనేం చేయగలను? లవ్ యూ.హ్యాపీ బర్త్‌డే అంటూ నందినీతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది.

ఇక ఆ ట్వీట్ పై స్పందించిన నందిని రెడ్డి బిగ్ హగ్స్.లవ్ యూ సామ్ అంటూ రిప్లై ఇచ్చింది.ఇకపోతే నందిని రెడ్డి సమంత ఇద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.
వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.కాగా సమంత, నందినీ రెడ్డి ఇద్దరు కలిసి జబర్దస్త్, ఓ బేబీ చిత్రాలకు పని చేసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయిన సమయంలో నందిని రెడ్డి సమంతకు తోడుగా ఉంటూ ఆమెకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది.సమంత కష్టాలతో సావాసం చేస్తున్న సమయంలో నందిని ఆమెకు అండగా నిలబడింది.
తను ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ మహిళా డైరెక్టర్ సాయం చేసిందని అంటుంటారు.







