తెలంగాణలో ఘర్ వాపసీ జరుగుతోంది.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల భేటీ ముగిసింది.

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న ఇద్దరు నేతలు హస్తినకు వెళ్లిన సంగతి తెలిసిందే.

కాగా జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.ఈ క్రమంలో సభకు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను పొంగులేటి, జూపల్లిలు ఆహ్వానించారని తెలుస్తోంది.

ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు తిరిగి రావడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ క్రమంలోనే తెలంగాణలో ఘర్ వాపసీ జరుగుతుందన్నారు.

అదేవిధంగా కేసీఆర్ హఠావో.తెలంగాణ బచావో నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు