ఆ సినిమా స్పూర్తితో 'గని' పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుందా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రెజెంట్ నటిస్తున్న సినిమా గని.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

 'ghani' Entry Into Pan India Movies Inspired By 'pushpa' Movie, Pan India, Varun-TeluguStop.com

ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.ఈ సినిమా లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

గని సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.ఇటీవలే ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.కానీ అప్పుడు కూడా వాయిదా వేశారు.అయితే ఈ సినిమా ఆలస్యానికి కారణం ఏంటి అని ఇప్పుడు ఒక డిబేట్ నడుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.

Telugu Ghanipan, Gani, Pan India, Varun Tej, Varun Tej Gani-Movie

గని సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని వార్త బయటకు వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ లు కూడా ఉన్నారు.అలాగే విదేశీ టెక్నీషియన్స్ సైతం ఈ సినిమా కోసం పని చేసారు.

అలాగే ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ కూడా నిర్మాతగా పరిచయం అవుతున్నాడు.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఉత్తరాదిన పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ ఉన్న కారణంగానే ఈ సినిమా వాయిదా పడింది అని టాక్.ఇటీవలే రిలీజ్ అయిన పుష్ప ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమా సక్సెస్ తో అల్లు అరవింద్ కూడా అడుగు ముందుకు వేసినట్టు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube