Google Maps : గూగుల్ మ్యాప్స్‌ని నమ్మిన జర్మన్ టూరిస్టులకు షాక్.. ఆస్ట్రేలియన్ అరణ్యంలో ఇరుక్కున్నారు..!

గూగుల్ మ్యాప్స్( Google Maps ) గుడ్డిగా నమ్మిస్తే ప్రమాదాల్లో పడక తప్పదు.ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది.

 German Tourists Lost In Australian Forest After Following Google Maps-TeluguStop.com

అయినా ప్రజలు దీనిపైనే పూర్తిగా ఆధారపడుతూ చివరికి అత్యంత గడ్డు పరిస్థితిలో చిక్కుకుపోతున్నారు.తాజాగా ఇద్దరు జర్మన్ టూరిస్టులు గూగుల్ మ్యాప్స్ ని నమ్మి ఆస్ట్రేలియా అడవి( Australian Forest ) మధ్యలో ఇరుక్కున్నారు.

ఈ ఇద్దరు జర్మన్ టూరిస్టులు పేర్లు ఫిలిప్ మేయర్, మార్సెల్ స్కోయెన్‌.వారికి గూగుల్ మ్యాప్స్ తప్పుడు ఆదేశాలు ఇచ్చింది.

పర్యాటకులు కెయిర్న్స్ నుంచి బమగాకు( Cairns to Bamaga ) వెళ్లాలని ప్లాన్ చేశారు, కానీ గూగుల్ మ్యాప్స్ వారిని క్లోజ్ చేసిన నేషనల్ పార్క్ వైపు నడిపించింది.అక్కడ ఎవరూ ఉపయోగించని మట్టి రోడ్డు ఉంది.

ఆ రోడ్డులో 37 మైళ్ల దూరం వెళ్లాక వారి కారు బురదలో కూరుకుపోయింది.అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా లేదు, ఎక్కువ ఆహారం లేదా నీరు వారి కూడా లేదు.

అక్కడే ఉంటే చనిపోవడం ఖాయమని భావించిన టూరిస్టులు( German Tourists ) సహాయం కోసం వారు తమ కారును విడిచిపెట్టి, వారానికి పైగా నడిచారు.సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉండటం అప్పుడప్పుడు తుఫాను రావడం జరిగింది.దీనివల్ల వారు చాలా సఫర్ అయ్యారు.వారు వెళ్తున్న మార్గంలో ఒక నది అనిపించగా అందులో మొసళ్లు ఉన్నాయట.వాటిని చూసి చాలా భయమేసింది అని ఈ టూరిస్టులు తెలిపారు.ఒకానొకరోజు వారు వర్షంలో తడుస్తూ ఆరుబయటే పడుకున్నారు.

వారు కోయెన్ అనే చిన్న పట్టణానికి చేరుకునే వరకు ఒక వారం పాటు నడిచారు.

అక్కడ సహాయం కోరారు.రోజర్ జేమ్స్ అనే రేంజర్ మాట్లాడుతూ, వారు రహదారికి బదులుగా మట్టి రోడ్డును ఫాలో అయ్యారని చెప్పారు.వీలైనంత కాలం కారులో ఉన్నారని కానీ తర్వాత అక్కడికి ఎవరూ రారని తెలుసుకొని వాకింగ్ చేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఈ జర్మన్ పర్యాటకులు క్షేమంగా ఉన్నారని తాజాగా గూగుల్ ఒక అప్‌డేట్ ఇచ్చింది.ఏం తప్పు జరిగిందో పరిశీలిస్తామని ఆమె ఇచ్చింది.గూగుల్ మ్యాప్స్ పొరపాటు చేయడం ఇదే మొదటిసారి కాదు.కొన్ని నెలల క్రితం, కాలిఫోర్నియాలోని కొంతమందికి హైవేకి బదులుగా ఎడారిలోకి వెళ్లమని చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube