నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కీర్తి సురేష్( Keerthy Suresh ) మహానటి సావిత్రి పాత్రలో నటించిన “మహానటి” మూవీ( Mahanati Movie ) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా అప్పట్లో 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుంది.
కీర్తి సురేష్ ఎన్ని సినిమాలలో నటించినా ఈ సినిమా ఒకింత స్పెషల్ అనే చెప్పాలి.జెమినీ గణేషన్ కూతురు కమల సెల్వరాజ్( Kamala Selvaraj ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
తన పేరు గురించి ఆమె మాట్లాడుతూ కమలా గణేషన్ అని పిలిస్తేనే సంతోషంగా ఉంటుందని అన్నారు.జెమినీ గణేషన్ కూతురు( Gemini Ganeshan Daughter ) కావడం నాకు సంతోషాన్ని కలిగిస్తుందని ఆమె కామెంట్లు చేశారు.
నాన్నగారు 4 షిఫ్ట్ లలో పని చేసిన రోజులు ఉన్నాయని కమల అన్నారు.నాన్నకు ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం ఇష్టమని కమల తెలిపారు.నాన్న చాలామంది వ్యక్తి అని ఆమె కామెంట్లు చేశారు.

నాన్న వెంట మేము వెళితే మేము ఆయనకు చెల్లెళ్లమా అని అడిగేవారని కమల పేర్కొన్నారు.మహానటి మూవీలో నాన్న పాత్ర గురించి చూపించిందంతా నిజం కాదని ఆమె తెలిపారు.చాలామంది బయటకు చెప్పకుండా పెళ్లిళ్లు చేసుకున్నారని మా అన్న ఓపెన్ బుక్ అని ఆయన ఏదీ దాచలేదని కమల వెల్లడించారు.
నాన్న పెళ్లి కోసం ఎవరినీ ఫోర్స్ చేయలేదని ఆమె పేర్కొన్నారు.నాన్న కోసం చాలామంది యంగ్ అమ్మాయిలు ఎదురుచూసేవారని ఆమె పేర్కొన్నారు.