దిగ్గజ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్( Kamal Haasan ) మొదటగా వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు.తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకుని సారిక ఠాగూర్ ను పెళ్లాడాడు.
ఆమెకు కూడా విడాకులు ఇచ్చి అలనాటినాటి గౌతమి తాడిమల్లతో సహజీవనం ప్రారంభించాడు.వీళ్లు లీగల్ గా పెళ్లి చేసుకోకపోయినా భార్యాభర్తల్లాగానే కలిసి ఉన్నారు.2004 నుంచి వీరి సహజీవనం ప్రారంభమైంది.గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
గాంధీనగర్ రెండో వీధి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ ముద్దుగుమ్మ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

అయితే గౌతమి( Gautami ) హీరోయిన్ శ్రుతి హాసన్ ను చిన్నప్పటినుంచే పెంచిందనే ఒక భావన చాలా మందిలో ఉంది.అయితే అది నిజం కాదని గౌతమి తాజాగా ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టింది.“నేను శ్రుతి గురించి తొలిసారిగా తెలుసుకునే నాటికే ఆమెకు దాదాపు 17-18 ఏళ్లు ఉన్నాయి.నేను తొలిసారి కలిసినప్పుడు శ్రుతి( Shruti Haasan ) అప్పటికే కాలేజీ పూర్తి చేసి మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యే క్రమంలో ఉంది.మరోవైపు నా క్యాన్సర్ ట్రీట్‌మెంట్( Cancer Treatment ) పూర్తి అయి లాస్ట్ రేడియేషన్ జరుగుతోంది.45 సైకిల్స్ రేడియేషన్ పూర్తి చేశాను.ఇంకా రెండు రేడియేషన్స్ ఉన్నాయి.
అయితే అప్పుడే నేను శ్రుతిని తీసుకొని యూఎస్ వెళ్లాను.యూఎస్ అంటే నాకు చాలా ఇష్టం.
నిజానికి అక్కడ ఉండటానికి నేను అలవాటు పడ్డాను.అక్కడే శ్రుతిని కాలేజీలో జాయిన్ చేయించాను.
అప్పటికే శ్రుతి అడ్మిషన్ పొందింది.నేను కాలేజీలో చేర్పించి సెటిల్ చేశాను.” అని గౌతమి చెప్పుకొచ్చింది.

శ్రుతిని వెంటబెట్టుకొని వెళ్లేటప్పుడు తాను వీల్ చైర్‌లో వెళ్లానని, అలా వెళ్లడం అదే తొలిసారి అని గౌతమి పేర్కొంది.“కీమో, ఇంకా తదితర క్యాన్సర్ చికిత్సలు తీసుకోవడం వల్ల బాగా బలహీనంగా ఉన్నాను ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక వీల్ చైర్( Wheel Chair ) లోనే కూర్చున్నాన”ని వివరించింది.మొత్తం మీద శ్రుతి తనకు కాలేజీ వయసు నుంచి మాత్రమే తెలుసునని, చిన్నప్పుడు ఆమెను తాను పెంచలేదని గౌతమి ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
గౌతమి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.శ్రుతి ఇప్పటిదాకా గౌతమితో కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు.భవిష్యత్తులో వారిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.







