ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లోకి అడుగుపెట్టిన రోజు నుండి మొన్నటి వరకు మాస్క్ ఏసుకొని మహాత్మా గాంధీ లాగ ఫోజులు ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే టక్కుమని మనకి గుర్తుకు వచ్చే పేరు శివాజీ.నక్క వినయం తో, తన మాటకారి తత్త్వం తో ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ని సైతం ఏమార్చగల ఘనుడు అని ఈయనపై సోషల్ మీడియా లో ఒక పెద్ద టాక్ ఉంది.
హౌస్ లో ప్రతీ ఒక్కరు ఈయనకి సలాం కొట్టి భజన చేస్తూ తన చుట్టూ తిరగాల్సిందే.లేకపోతే వెనక చేరి విషం కక్కిన వీడియోలు మనం రోజు సోషల్ మీడియా లో చూస్తూనే ఉంటాం.
కానీ దురదృష్టం ఏమిటంటే ఇవన్నీ టీవీ టెలికాస్ట్ లో చూపించరు.నాగార్జున కూడా శివాజీ ఒక దైవ దూత అన్నట్టుగా ఆయనవైపు మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనించొచ్చు.

అయితే శివాజీ( Shivaji ) నక్క వినయం ని అర్థం చేసుకొని, అతనికి మొదటి నుండి హౌస్ లో ఢీ కొడుతున్న ఏకైక కంటెస్టెంట్ గౌతమ్ మాత్రమే.శివాజీ కి ఉన్న మాస్క్ చిన్నగా వీడిపోతూ రావడానికి కారణం గౌతమ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్కులో( captaincy task ) గౌతమ్ శివాజీ కి ఒక రేంజ్ లో ఇచిపారేసాడు.మీరే రెండవ బిగ్ బాస్ లాగా ప్రవర్తించి అన్నీ మీరే చెప్పేయండి అంటూ శివాజీ ని అంటాడు.
అప్పుడు శివాజీ ఇలాగే మాట్లాడి పోయిన వీకెండ్ నాగ్ సార్ చేతిలో పడింది కదా నీకు అంటాడు సోఫాజి.క్షమించండి శివాజీ.అప్పుడు గౌతమ్ తిట్టనివ్వు అన్నా, చంపనివ్వు అని పెద్ద గా అరిచి మాట్లాడుతాడు.అలా ఇద్దరి మధ్య వాదన కొట్టుకునే రేంజ్ కి పోతాది.
ఇదంతా నువ్వు అటెన్షన్ కోసమే చేస్తున్నావ్ అని శివాజీ గౌతమ్ ని అంటాడు.

అప్పుడు గౌతమ్ మైక్ విసిరి కొట్టి బిగ్ బాస్ అవుట్ గేట్ ని తడుతూ బయటకి పంపండి బిగ్ బాస్ అని అంటాడు.ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.సోఫాజి అలియాస్ శివాజీ కి ఎదురు తిరగడం పై గౌతమ్ కి సర్వత్రా సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తుంది.
శివాజీ ఇలాగే అమర్ దీప్ ని చాలా తక్కువ చేస్తూ, తన బ్యాచ్ మొత్తానికి అతని మీద నెగటివ్ ఫీలింగ్ ని కలిగించి మొదటి వారం నుండి మొన్నటి వారం వరకు నామినేషన్స్ వేయిస్తూ వచ్చాడు.అమర్ దీప్ శివాజీ కి ఇప్పటికీ గౌరవం ఇస్తుంటాడు, కానీ శివాజీ మాత్రం అమర్ దీప్ ని ఒక పనికిమాలిన వాడిలాగా జనాలకు ప్రాజెక్ట్ చేసాడు.
అతను ఎదో ఒకరోజు శివాజీ మీద రియాక్ట్ అయితే బాగుండును అని అనుకున్నారు కానీ, అతని బదులు గౌతమ్ అయ్యాడు.దీని రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.