బాలకృష్ణ సినిమా టైటిల్ మారింది ?

నందమూరి బాలకృష్ణ, క్రిష్ డైరెక్షన్ లో తన 100వ సినిమాలో నటించబోతున్నాడు.నిన్నటివరకు ఈ చిత్రానికి టైటిల్ గా యోధుడు ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే క్రిష్ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ చిత్రం కోసం గౌతమీ పుత్ర శాతకర్ణి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.దీంతో క్రిష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులు కానున్నారని తెలుస్తోంది.

దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్.కథను బట్టి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని తెలుస్తోంది.

ఉగాది రోజున ఈ సినిమాను ప్రారంభించనున్నారు.బాలకృష్ణ ఆహార్యం, స్టైల్ , లూక్స్ అన్నీ ఈ సినిమా కోసం మార్చేసారు క్రిష్.

Advertisement

అద్వితీయమైన రాజుగా బలయ్య్యని చూపిస్తూ ఈ సినిమా సాగుతుంది అంటున్నారు.బాలకృష్ణ తన కెరీర్ మొత్తం లో చేసిన సినిమాలు ఒక ఎత్తూ ఈ సినిమా ఒక ఎత్తు అంటున్నారు .క్రిష్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నిజానికి సాయి కొర్ర పాటి ప్రొడ్యూస్ చెయ్యాల్సి ఉంది.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
Advertisement

తాజా వార్తలు