విజయ్ సినిమాలో విలన్ గా డైరెక్టర్..!

దళపతి విజయ్ 66వ సినిమా వారసుడు సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అయ్యింది.ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

 Gautam Menon Negative Role In Vijay 67th Movie Details, Gautam Menon, Kollywood,-TeluguStop.com

విజయ్ 67వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ఐదుగురు విలన్ లు ఉంటారని తెలుస్తుంది.అందులో ఒక విలన్ గా తమిళ దర్శకుడు గౌతం మీనన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

విజయ్ 67వ సినిమాలో తను నటిస్తున్న విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు గౌతం మీనన్.

డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన గౌతం మీనన్ ఈమధ్య యాక్టర్ గా టర్న్ తీసుకున్నారు.

ఆల్రెడీ ఇప్పటికే సినిమాల్లో కనిపిస్తున్న గౌతం మీనన్ తెలుగులో సీతారామం సినిమాలో కూడా చిన్న రోల్ చేశారు.ఇక ఇప్పుడు దళపతి విజయ్ సినిమాలో వన్ ఆఫ్ ది విలన్ గా చేస్తున్నారు.

విజయ్ సినిమాలో నటించడం తను ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు గౌతం మీనన్.విక్రం తర్వాత లోకేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఈ సినిమా కూడా విక్రం స్టైల్ లో యాక్షన్ మూవీగా ఉంటుందని అంటున్నారు. వారసుడు క్లాస్ సినిమాగా వస్తుండగా లోకేష్ సినిమాతో మరోసారి మాస్ ఆడియన్స్ ని అలరించనున్నాడు విజయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube