Payal Ghosh: నేను వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ నాకు ఫోన్లు చేశాడు.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ ( Payal Ghosh ) అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సూపరిచితమే.

ఈమె ఎన్టీఆర్ తమన్నా హీరో హీరోయిన్లు గా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా చేసింది.

ఇక ఈమె ఆ తర్వాత కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ సినిమాల కంటే ఎక్కువగా వివాదాల ద్వారానే ఫేమస్ అయ్యింది.ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఇరుక్కొని ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.

బాలీవుడ్ లో జరిగిన ఎన్నో విషయాలను బయటపెట్టింది.అలాగే బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా మంచిదని అక్కడ ఉండేవారు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తారు అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కష్యప్ ( Anurag kashyap ) మీద ఈమె చేసిన ఆరోపణలు ఎంత పెద్ద దుమారం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Advertisement

అయితే తాజాగా ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.పాయల్ ఘోష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా చెప్పుకొచ్చింది.నేను 2011లో క్రికెటర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ ( Irphan pathan ) తో ప్రేమలో ఉన్నాను.

మా రిలేషన్ దాదాపు 5 సంవత్సరాల దాకా కొనసాగింది.కానీ ఆ తర్వాత ముగిసింది.ఇక నేను ఇర్ఫాన్ పఠాన్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అలాగే గౌతమ్ గంభీర్ ( Gautha gambir ) ఇద్దరు నన్ను ట్రై చేశారు.

వారిద్దరికీ నేనంటే చాలా ఇష్టం.కానీ నేను ఇర్ఫాన్ పఠాన్ ని తప్ప ఆ ఇద్దరిలో ఎవరిని కూడా ఇష్టపడలేదు.

ఇర్ఫాన్ పఠాన్ తో బ్రేకప్ తర్వాత కూడా ఎవర్ని ఇష్టపడలేదు.నన్ను గౌతమ్ గంభీర్ అలాగే అక్షయ్ కుమార్ ( Akshay kumar ) ఇష్టపడుతున్నారనే విషయం కూడా ఇర్ఫాన్ పఠాన్ కి చెప్పాను.ఇక ఇర్ఫాన్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో గౌతమ్ గంభీర్ ప్రతిసారి నా ఫోన్ కి మిస్డ్ కాల్ ఇస్తూ ఉండేవాడు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

కానీ అక్షయ్ కుమార్ చాలా మంచివాడు.అక్షయ్ కుమార్ ఎప్పుడూ కూడా నా దగ్గర అసభ్యంగా ప్రవర్తించలేదు.అందుకే ఆయన పెద్ద స్టార్ అయ్యాడు.

Advertisement

అంటూ పాయల్ ఘోష్ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

తాజా వార్తలు