ఫోర్బ్స్ టాప్ 20లో అదానీ... ఖుషీఖుషీగా కార్పొరేట్ దిగ్గజాలు..!

హిండెన్​బర్గ్​ రిపోర్ట్ ప్రకారం ఇటీవలికాలంలో రూ.లక్షల కోట్లను నష్టపోయిన గౌతమ్​ అదానీ, తన కంపెనీల షేర్లు పుంజుకోవడంతో మరలా సంపదను పెంచేసుకున్నాడు.

 Gautam Adani Again Back In Top 20 Of Forbes List Details, Adani ,forbes, Top 20-TeluguStop.com

ఎంత త్వరగా పోగొట్టుకున్నారో, అంతే స్పీడుగా తిరిగి సంపాదించుకున్నారు.వారిని ఊరికే సంపన్నులు అని అనరు కదా! ఈ ఏడాది జనవరి 17న ఆయన ప్రపంచంలోనే 3వ అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డుకెక్కారు.

ఇక ఈ రిపోర్టు కారణంగా పోయినవారం టాప్– 20లో కూడా ఆయన కనబడక పోవడం కొసమెరుపు.ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడటంతో మళ్లీ ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలోకి ఎక్కేసారు.

Telugu Adani, Forbes, Gautam Adani, Hindenburg, Latest, Sebi, Stock, Top Corpora

అయితే ఇది వారికి కొత్తేమి కాదు.వారే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న కుబేరులంటే ఇదే మాదిరి ఎక్కుతూ, దిగుతూ వుంటారు.కాగా ఈయన ప్రస్తుతం 17వ ర్యాంకులో ఉన్నారు.తాజాగా మంగళవారం అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగిన తర్వాత, ఆయన నెట్​వర్త్​ 463 మిలియన్ డాలర్లు అంతే దాదాపు రూ.3,811 కోట్లు ఎగబాకింది.దాంతో అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇంట్రాడేలో అప్పర్ సర్క్యూట్‌ను తాకి 14.63 శాతం పెరిగింది.డిసెంబర్ క్వార్టర్​లో లాభం తగ్గినప్పటికీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఏపీఎస్ఈజెడ్) 1.33 శాతం లాభపడింది.

Telugu Adani, Forbes, Gautam Adani, Hindenburg, Latest, Sebi, Stock, Top Corpora

ఇకపోతే అదానీ గ్రూపుపై హిండన్​బర్గ్ ​గ్రూపు ఇటీవల పలు ఆరోపణలు చేసినప్పటికీ, అవేమి అదానీ గ్రూపుని ప్రభావితం చేయలేకపోయింది.కాగా ఈ కంపెనీ స్టాక్స్​పై 2019 నుంచే నిఘా ఉన్నట్టు స్టాక్​ మార్కెట్​ డేటా చూపిస్తోంది.ధరల్లో భారీ మార్పులు, ప్రమోటర్ల షేర్లు తనఖాలో ఉండటంతో 6 కంపెనీ షేర్లను ‘అడిషనల్ సర్వైలెన్స్ మెకానిజం’లో ఉంచినట్టు సెబీ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే.

అయితే అదానీ ఎపిసోడ్​ను మార్కెట్ రెగ్యులేటర్​ సెబీ పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శించడం మనం అసెంబ్లీలో చూడవచ్చు.సెబీ స్పందిస్తూ స్టాక్​ మార్కెట్ల ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని, ఇందుకు అవసరమైన నిఘా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube