ఫోర్బ్స్ టాప్ 20లో అదానీ… ఖుషీఖుషీగా కార్పొరేట్ దిగ్గజాలు..!

హిండెన్​బర్గ్​ రిపోర్ట్ ప్రకారం ఇటీవలికాలంలో రూ.లక్షల కోట్లను నష్టపోయిన గౌతమ్​ అదానీ, తన కంపెనీల షేర్లు పుంజుకోవడంతో మరలా సంపదను పెంచేసుకున్నాడు.

ఎంత త్వరగా పోగొట్టుకున్నారో, అంతే స్పీడుగా తిరిగి సంపాదించుకున్నారు.వారిని ఊరికే సంపన్నులు అని అనరు కదా! ఈ ఏడాది జనవరి 17న ఆయన ప్రపంచంలోనే 3వ అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డుకెక్కారు.

ఇక ఈ రిపోర్టు కారణంగా పోయినవారం టాప్– 20లో కూడా ఆయన కనబడక పోవడం కొసమెరుపు.

ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడటంతో మళ్లీ ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలోకి ఎక్కేసారు.

"""/" / అయితే ఇది వారికి కొత్తేమి కాదు.వారే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న కుబేరులంటే ఇదే మాదిరి ఎక్కుతూ, దిగుతూ వుంటారు.

కాగా ఈయన ప్రస్తుతం 17వ ర్యాంకులో ఉన్నారు.తాజాగా మంగళవారం అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగిన తర్వాత, ఆయన నెట్​వర్త్​ 463 మిలియన్ డాలర్లు అంతే దాదాపు రూ.

3,811 కోట్లు ఎగబాకింది.దాంతో అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇంట్రాడేలో అప్పర్ సర్క్యూట్‌ను తాకి 14.

63 శాతం పెరిగింది.డిసెంబర్ క్వార్టర్​లో లాభం తగ్గినప్పటికీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఏపీఎస్ఈజెడ్) 1.

33 శాతం లాభపడింది. """/" / ఇకపోతే అదానీ గ్రూపుపై హిండన్​బర్గ్ ​గ్రూపు ఇటీవల పలు ఆరోపణలు చేసినప్పటికీ, అవేమి అదానీ గ్రూపుని ప్రభావితం చేయలేకపోయింది.

కాగా ఈ కంపెనీ స్టాక్స్​పై 2019 నుంచే నిఘా ఉన్నట్టు స్టాక్​ మార్కెట్​ డేటా చూపిస్తోంది.

ధరల్లో భారీ మార్పులు, ప్రమోటర్ల షేర్లు తనఖాలో ఉండటంతో 6 కంపెనీ షేర్లను ‘అడిషనల్ సర్వైలెన్స్ మెకానిజం’లో ఉంచినట్టు సెబీ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే.

అయితే అదానీ ఎపిసోడ్​ను మార్కెట్ రెగ్యులేటర్​ సెబీ పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శించడం మనం అసెంబ్లీలో చూడవచ్చు.

సెబీ స్పందిస్తూ స్టాక్​ మార్కెట్ల ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని, ఇందుకు అవసరమైన నిఘా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపింది.

అందాన్నే కాదు శనగపిండి జుట్టును కూడా పెంచుతుంది.. ఎలా వాడాలంటే..?