మాజీ మంత్రి ప్రస్తుతం విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం అందరికీ ఆసక్తికరంగా మారింది .ఆయన 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
అయితే ఆయన వైసీపీ లోకి వెళ్లాలని ఎంతగానో ప్రయత్నాలు చేసినా, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పార్టీ మారే విషయంలో గంటా శ్రీనివాసరావు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.అయితే ప్రస్తుతం రాజకీయంగా ఏపీలో వాతావరణం చిత్ర విచిత్రంగా ఉంది.
ఏ పార్టీతో మరే పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే విషయంలో క్లారిటీ లేదు.అయితే జనసేన టిడిపి లు ఏపీ లో పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే ప్రచారం తీవ్రం కావడంతో ఎన్నికల సమయానికి అది వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉండడంతో , గంటా అలర్ట్ అయ్యారు.
తాను ప్రస్తుతం టిడిపిలో కొనసాగినా, మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చినా, తనకు మంత్రి పదవి ఇవ్వరు అనే విషయాన్ని గంటా గుర్తించారు .ఇప్పటికే తన పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిడిపిలో ఉన్నా, టికెట్ దక్కడం , మంత్రి పదవి దక్కడం ఇవన్నీ అతికష్టమైన వ్యవహారాలను ఆయన గుర్తించారు .అందుకే తన ఎత్తుగడను మార్చినట్లు కనిపిస్తున్నారు.ఎలాగూ జనసేన టిడిపి పొత్తు పెట్టుకుంటే తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.
అందుకే ఎన్నికల సమయం నాటికి జనసేన లో చేరితే టిడిపి , జనసేన ప్రభుత్వం ఏర్పడితే కనుక జనసేన తరఫున తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.