విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద యువకుడు దారుణం హత్య
మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద యువకుడు దారుణం హత్య కు గురయ్యాడు.ఈమేరకు స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అర్.
పి.ఎఫ్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనపై ఆరా తీశారు.మృతుని తలపై తీవ్ర గాయాలై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.అయితే ఘటనలో మృతిచెందిన యువకుడు గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన రేబాక సాయి తేజ ( 22 ) గా పోలీసులు గుర్తించారు.
గత రాత్రి అతని స్నేహితులతో మద్యం సేవించేందుకు మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ వద్ద చేరుకుని మద్యం సేవించారు.ఈ క్రమంలో గ్రీన్ గార్డెన్స్ ప్రాంతానికి చెందిన అతని స్నేహితుడు బంగార్రాజు కి తేజా మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఘర్షణలో బంగార్రాజు అతడి స్నేహితులు తేజ ను హతమార్చారని తేజ బంధువులు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అర్.పి.ఎఫ్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ పోలీసులు సమీప ప్రాంతంలో సీసీ టీవి ఫుటేజ్ లు పరిశీలించారు.సీసీ టీవి ఫుటేజ్ లో ఘర్షణ కు సంబందించి దృశ్యాలు నమోదు కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.విషయం తెలుసుకున్న ఏసీపీ పెంటారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.
రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల గురించి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.