కొండాపూర్‎లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల విక్రయ ముఠా అరెస్ట్..!

ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది.

ఈ మేరకు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల( IPL black tickets )ను విక్రయిస్తున్న ముగ్గురు సాప్ట్ వేర్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొండాపూర్( Kondapur ) లో ఐపీఎల్ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ టికెట్లను వీరు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.ఈ క్రమంలో ఒక్కో టికెట్ ను రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు