ఈ మధ్య కాలంలో చూసుకుంటే రకరకాల వీడియో గేమ్స్… ఉదాహరణకు ‘ఇండస్ బ్యాటిల్ రాయల్‘ లాంటి వీడియో గేమ్‌లతోపాటు సైన్స్ ఫిక్షన్, మ్యూజిక్‌లలో దేవుళ్లు, పురాణ కథలు, గిరిజన సంప్రదాయాలను నేపథ్యంగా తీసుకొని క్రియేట్ చేయడం జరుగుతుంది.అదేవిధంగా 2022లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్క్రీన్‌లపై భారత్ ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఒక వీడియో కనిపించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
అందులో ఒక దృశ్యంలో వినాయకుడు యుద్ధానికి సిద్ధమైన యోధుడిగా కనిపించారు.అదేవిధముగా మొఘల్ చక్రవర్తుల పాలనా కాలానికి ప్రతీకలుగా చెప్పుకునే మినార్‌ను బంగారం, లేజర్ తళుకులతో చూపించారు.

ఇవన్నీ మనకు ఇండస్ బ్యాటిల్ రాయల్ వీడియోగేమ్ ట్రైలర్‌లో కనిపించిన దృశ్యాలు.సింధూ నాగరికత నేపథ్యంలో అంతరిక్షంలో తిరుగుతున్నట్లుగా ఈ గేమ్ అనుభూతిని ఇస్తుంది.సింధూ నాగరికత గురించి అందరికీ తెలిసినదే.‘‘సింధూ’’ క్రీ.పూ.3000లలో భారత ఉపఖండంలో వెల్లువిరిసిన సంగతి తెలిసిందే.భారత ఆధ్యాత్మిక చరిత్ర, వాస్తుకళా వైభవానికి సైన్స్ ఫిక్షన్ హంగులు అద్దే ఫిలాసఫీని ఇండోఫ్యూచరిజంగా ఇపుడు పిలుస్తున్నారు.ఇటు సైన్స్ ఫిక్షన్ అటు సంగీతం లేదా కళలు ఇలా ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ ఈ భవిష్యవాణిలో భారత ఆధ్యాత్మిక చరిత్ర, సంప్రదాయాలు మెండుగా మనకు కనిపిస్తున్నాయి.

అయితే, ఇవి ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రేక్షకులను సంపాదించుకోవడం విశేషం.అయితే దీనికి ఏకైన కారణం కేవలం భారతీయతను ప్రదర్శించడం అంటే అదొక్కటే కాదు మరి, అధునాతన టెక్నాలజీ, వినసొంపైన సంగీతం, అన్ని వర్గాలకూ ప్రాధాన్యమిచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడం లాంటి కారణాల వలన జనాలకు సదరు ప్రొడక్ట్స్ బాగా నచ్చేస్తున్నాయి.సింధూ నాగరికతను ఆధారంగా చేసుకొని అంతరిక్షంలో మరో గ్రహం మీదకు వెళ్లే క్రమంలో చాలా మంది దేవుళ్లను ఈ వీడియో గేమ్‌లో చూడొచ్చు.ఇక్కడ ధైర్యానికి ప్రతీకగా భావించే జటాయువు కూడా కనిపిస్తుంది.
దీనికి ఫీనిక్స్ రెక్కలు అతికించడం అదనపు హంగుగా చెప్పుకోవాలి.ఇంకా ఇలాంటి కారణాలు ఎన్నో వున్నాయి.
ఇంకా డెప్త్ కి వెళ్లి చూస్తే….మన భారతీయతను వారు అర్ధం చేసుకుంటున్నట్టుగా మనం అర్ధం చేసుకోవడం లేదనే చెప్పుకోవాలి.





 

