కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో బిజెపి అగ్ర నేతలు ఉన్నారు.అయితే గతంలో ఉన్నంత సానుకూలత ఇప్పుడు లేకపోవడం, ఎన్డీఏ కూటమిలోని చాలా పార్టీలు బయటకు వెళ్లిపోవడం ఇవన్నీ బీజేపీ అగ్ర నేతలను కలవరానికి గురిచేస్తుంది.
అందుకే తమకు అవకాశం ఉంటుందనుకున్న రాష్ట్రాల్లో మరింత పట్టు పెంచుకోవడం ద్వారా కేంద్రంలో అధికారానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అంతేకాకుండా ఎప్పటి నుంచో తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు .ప్రస్తుతం బి.ఆర్.ఎస్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఓడించి బిజెపిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా తమ పంతం నెరవేర్చుకోవచ్చనే ఆలోచనతో బిజెపి అగ్ర నేతలు ఉన్నారట.
అందుకే తరుచుగా తెలంగాణకు కేంద్ర మంత్రులతో పాటు , కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలు చేస్తున్నారు.తాజా ప్రధాని నరేంద్ర మోది ఈ నెలలోనే తెలంగాణలో పర్యటించేందుకు షెడ్యూల్ తయారయింది.
ప్రధాని పర్యటనలో దాదాపు 7వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.ఇక ప్రధాని మోది పర్యటన ముగిసిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.

ఈనెల 19న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోది రానున్నారు.మోదీ తన పర్యటనలో వందే భారత్ ట్రైన్ కూడా ప్రారంభిస్తారు .699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేయనున్నారు.

అలాగే 1410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ , మహబూబ్ నగర్ మధ్య 85 కిలోమీటర్ల మేర నిర్మించిన డబుల్ ట్రాక్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు.ఐఐటి హైదరాబాదులో 2597 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.ఇక ప్రధాని పర్యటన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఇలా వరుస వరుసగా ఎన్నికల సమయం వరకు తరచుగా తెలంగాణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం హాజరుక అవుతారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు.
ఇప్పటికే టార్గెట్ 90 పేరుతో రాబోయే ఎన్నికల్లో 40 సీట్లను సాధించడమే లక్ష్యంగా బిజెపి ప్రణాళికలు రచిస్తోంది .దీనిలో భాగంగానే ఆ టార్గెట్ ను రీచ్ అయ్యే విధంగా బిజెపి అగ్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ స్థాయి సమావేశాలు , మార్చి 5 నుంచి జిల్లా సమావేశాలు నిర్వహిస్తామని బిజెపి ఎంపీ లక్ష్మణ్ చెబుతున్నారు.







