అమెరికా( America ).ప్రపంచానికి పెద్దన్న.
ఆర్ధిక, సైనిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాటిలేని శక్తిగా అవతరించి అగ్రరాజ్యంగా వెలుగొందుతోంది.ప్రపంచంలోని ఏ దేశాన్నైనా, ఎలాంటి వారినైనా కనుసైగతో శాసించగల శక్తి అమెరికాది.
ఈ దేశానికి జార్జ్ వాషింగ్టన్ నుంచి జో బైడెన్ ( Joe Biden )వరకు ఎందరో అధ్యక్షులుగా వ్యవహరించారు.వీరు తీసుకునే నిర్ణయాలు ప్రపంచగతినే మార్చేయగలవు.
అమెరికాలో చోటు చేసుకునే ఏ చిన్న పరిణామామైనా పెను ప్రభావం చూపుతోంది.అందుకే అమెరికా అధ్యక్షుడికి ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా గౌరవ మర్యాదలు లభిస్తాయి.
మనదేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అమెరికా అధ్యక్షుడి పేరు నాలుక మీదే వుంటుందంటే అతిశయోక్తి కాదు.

అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో విలక్షణ వ్యక్తిత్వం.అందుకే వీరిని జనం కూడా మరిచిపోవడం లేదు.ఈ తరానికి మాత్రం బిల్‌క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మాత్రమే తెలుసు.
మరి అమెరికా మాజీ అధ్యక్షుల్లో మోస్ట్ పాపులర్ ఎవరు.ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు ‘‘Gallup’’ అనే సంస్థ సర్వే నిర్వహించింది.ఇందులో డొనాల్డ్ ట్రంప్‌కు 46 శాతం రేటింగ్ వచ్చింది.అంతేకాదు.
అమెరికా మాజీ అధ్యక్షులకు సంబంధించి గాలప్ చేసిన సర్వేలో ట్రంప్ చేరడం ఇదే తొలిసారి.ఈ సంస్థ చివరిసారిగా 2018లో సర్వే నిర్వహించింది.

అమెరికాలోని 50 రాష్ట్రాల్లో నివసిస్తున్న 1,013 మంది 2023 గాలప్ సర్వేలో పాల్గొన్నారు.మాజీ అధ్యక్షులలో జాన్ ఎఫ్ కెన్నెడీ 90 శాతంతో ఈ లిస్ట్‌లో అత్యధిక రేటింగ్ సాధించినవారిగా నిలిచారు.రిపబ్లికన్ పార్టీకి చెందిన రోనాల్డ్ రీగన్( Ronald Reagan ) 69 శాతం ఆమోదం, 28 శాతం మంది అసమ్మతితో రెండో స్థానంలో నిలిచారు.పోల్‌లో బరాక్ ఒబామాకు 63 శాతం ఆమోదం, 32 శాతం అసమ్మతి లభించింది.
జార్జ్ హెచ్ బుష్‌కి (సీనియర్ బుష్) 66 శాతం ఆమోదం, 37 శాతం అసమ్మతి వుంది.జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ (జూనియర్ బుష్)లను కూడా రేటింగ్ చేయబడ్డారు.
కానీ గాలప్ సర్వేలో ఇద్దరు మాజీ అధ్యక్షులు ఫోర్డ్, లిండన్ బి .జాన్సన్‌లను మాత్రం చేర్చలేదు.