ఇటలీలో మోడీ .. భారతీయ ప్రతినిధి బృందానికి పంజాబీ వంటకాలు, వార్తల్లోకి ఇండియన్ రెస్టారెంట్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.

 G7 Summit 2024 Punjabi Tadka In Italy As Phagwara-born Owner Caters To Indian D-TeluguStop.com

అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ రెస్టారెంట్లు( Indian restaurants ) పరదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి.మన వంటకాల రుచికి వారు కూడా వహ్వా అనాల్సిందే.

అందుకే ఏ దేశంలో చూసినా మన హోటళ్లు, రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతూ వుంటాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతీయుల కంటే అక్కడి స్థానికులే ఎక్కువగా ఆ హోటళ్లకు ఎగబడుతున్నారు.

ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు దానికి ఎవరైనా ఫ్యాన్స్‌గా మారాల్సిందే.

దక్షిణ ఇటలీలోని అపులియా రాజధాని నగరం బారీలో నిర్వహించబడుతున్న భారతీయ రెస్టారెంట్ జీ7 సమ్మిట్‌ 2024 ( G7 Summit 2024 )నేపథ్యంలో వార్తల్లోకెక్కింది.పంజాబ్‌లోని ఫగ్వారాకు చెందిన రూపిందర్ సింగ్ ( Rupinder Singh )ఏడాది క్రితం ‘‘ నమస్తే ఇండియా రెస్టారెంట్‌ ’’ను ప్రారంభించాడు.జీ7 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తన ప్రతినిధి బృందంతో కలిసి ఇటలికి వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోడీ,( Indian Prime Minister Narendra Modi ) తదితరులకు ఆయన రుచికరమైన భారతీయ వంటకాలను తినిపిస్తున్నారు.

Telugu Summit, Summitpunjabi, Indianprime, Indian, Luxuryresort, Punjabi Tadka,

మోడీ పర్యటన సందర్భంగా భారతీయ వంటకాల కోసం భారీగా ఆర్డర్లు వస్తున్నాయని రూపిందర్ తెలిపారు.ఇది తనకు , తన బృందానికి గొప్ప అవకాశమని.ఇక్కడ భోజనం చేయడం వారికి అసాధారణమైన అనుభూతిని కలిగిస్తుందన్నారు.భారతీయ ఆహారం విభిన్నమైన, శక్తివంతమైన రుచిని కలిగి ఉంటుందని.ఇటలీలో భారతీయులకు సేవ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని రూపిందర్ తెలిపారు.

Telugu Summit, Summitpunjabi, Indianprime, Indian, Luxuryresort, Punjabi Tadka,

కాగా.ప్రపంచంలోనే ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాల శిఖరాగ్ర సదస్సులో ఐదోసారి పాల్గొనేందుకు మోడీ గురువారం ఇటలీ చేరుకున్నారు.ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది.

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియాలోని లగ్జరీ రిసార్ట్ బోర్గో ఎగ్నాజియాలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.యూఎస్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌లు జీ7లో సభ్యదేశాలుగా ఉన్నాయి.

భారత్ 11వసారి జీ7 సమ్మిట్‌లో పాల్గొంటుండగా.ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 5వసారి హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube