రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుకుంటున్న 30 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది.ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడం కోసం ప్రముఖ ఎన్ఆర్ఐ రాదారపు సత్యం పలకలు, బలపాలు, చాక్లెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్తయ్య,ఎంపీటీసీ నాగరాణి,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, సల్మాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు కుబేర స్వామి, ఆంజనేయులు, ఉదయ లక్ష్మి, శోభారాణి, అరుంధతి, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.