ఢిల్లీ వేదికగా రెండు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సమావేశాలు ముగిశాయి.భారత్ సారథ్యం వహించి ప్రగతిమైదాన్ లోని భారత మండపంలో అట్టహాసంగా నిర్వహించిన ఈ సమ్మిట్ విజయవంతం అయింది.
జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత్ మాటకు ఏకగ్రీవ ఆమోదం లభించింది.జీ20 ఆఫ్రికన్ యూనియన్ చేరికతో జీ21 గా మారింది.ఈ క్రమంలోనే జీ21 ప్రెసిడెన్సీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగించారు.అయితే ఆఫ్రికా యూనియన్ కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై ప్రధాని మోదీ ప్రతిపాదన చేయగా సభ్య దేశాలు ఆమోదాన్ని తెలిపిన సంగతి తెలిసిందే.
కాగా ఆఫ్రికా దేశాలకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కోరుతూ ఆయన జీ20 అధినేతలకు గతంలోనే లేఖ రాశారు.దాంతో పాటు జులైలో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనలో సైతం ఈ ప్రతిపాదనను చేర్చారు.
ఈ క్రమంలోనే సభ్య దేశాల ఆమోదంతో దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన ఆఫ్రికన్ యూనియన్ జీ20 కూటమిలో చేరి ప్రపంచానికి మరింత చేరువైందని చెప్పుకోవచ్చు.