రాష్ట్ర విభజన జరగడం, దాదాపుగా 10ఏళ్ల సుధీర్గ కొంగ్రెస్ పాలన తరువాత తెలుగుదేశం సర్కారు అధికారంలోకి రావడం ఇలా ఎన్నో మార్పులు జరగాయి.అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి సరైన రూపం కల్పించి మళ్లీ వచ్చే ఎన్నికల్లో ప్రజల దృష్టిలో అభివృద్దికి చిరునామాగా తమ ఎజండాను మార్చుకుని ఎన్నికలకు వెళ్ళాలని చంద్రబాబు సర్కార్ ఆలోచనలు చేస్తుంది.ఇంతవరకూ ఎలా ఉన్నా రాజధాని నిర్మాణ విషయంలో అందరినీ కలుపుకుని పోకుండా చంద్రబాబు సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ రాష్ట్ర కొత్త రాజధాని భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
రాజధాని నిర్మాణం రోజుల్లో అయ్యేది కాదు.దీన్ని ఇప్పుడు చంద్రబాబు సర్కారు ప్రారంభిస్తున్నా.
ఈ ఐదేళ్లలో అయ్యే అవకాశమే లేదు.ఎంత ఆదునిక టెక్నాలజీ వాడినా.
ఎంత శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నా.రెండు మూడేళ్లలో రాజధాని నిర్మాణం కాదు.
ఒకవేళ.వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే.
ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే.రాజధాని నిర్మాణం భవిష్యత్ ఏంటి.
పైగా ఒక పక్క తాను అధికారంలోకి వస్తే మీ భూములు మీకిస్తానని తనను కలసిన రాజధాని రైతులకు జగన్ మాట ఇచ్చినట్లు సమాచారం.మరి అదే నిజం అయితే ఇపుడు రాబోయే రాజధాని భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పవా.
ఏది ఏమైనా చంద్రబాబు సర్కార్ అన్ని పార్టీలను కలుపుకుని పోయి రాజధాని నిర్మాణాన్ని చేపట్టడం ఎంతో మంచిది అని అందరి ఆలోచన.







