Future CM KTR: 'కాబోయే సీఎం కేటీఆర్ కు స్వాగతం '

ఎవరైనా అవును అన్న ఎవరు కాదన్నా టిఆర్ఎస్ పార్టీలోనూ, తెలంగాణ  ప్రభుత్వంలోనూ, సీఎం కేసీఆర్ తర్వాత చక్రం తిప్పేది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మాత్రమే.అసలు కెసిఆర్ జాతీయ రాజకీయాలపై చాలాకాలంగా దృష్టి సారిస్తున్న క్రమంలో , తెలంగాణ రాజకీయాలు అన్నిటిని కేటీఆర్ చక్కబెడుతున్నారు.

 Future Cm Ktr Flexis Viral In Kukatpally Details, Ktr, Telangana, Bjp, Telangana-TeluguStop.com

పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.మంత్రిగా అన్ని శాఖలపైనా సమీక్షలు నిర్వహిస్తూ కేసీఆర్ తర్వాత తానే ఆ స్థాయి వ్యక్తిని అని చెప్పకనే చెబుతున్నారు.

కొద్ది నెలల క్రితం వరకు కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే హడావుడి తెలంగాణలో నడిచింది.దీనికి తగ్గట్లుగానే కేసిఆర్ వ్యవహార శైలి ఉండేది.

కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు కేటీఆర్ ను తెలంగాణ రాజకీయాల్లో కీలకం చేసే విధంగా,  ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని,  త్వరలోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే హడావుడి నడిచింది.ఆ తర్వాత పూర్తిగా ఆ వ్యవహారం సర్దుమణిగిపోగా,  పార్టీ కేడర్ లో మాత్రం ఇప్పటికీ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అనే భావం ఏర్పడిపోయింది.

ఈ క్రమంలోనే కేటీఆర్ కూకట్ పల్లి పర్యటనలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.కాబోయే సీఎం కేటీఆర్ అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి.

Telugu Cm Ktr, Kookatpally Ktr, Ktr Flexis, Ktr Flexy, Telangana-Political

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించడంతో, తరువాతే తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ అనే చర్చ పార్టీలో తీవ్రంగా జరుగుతున్న క్రమంలోనే , ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.నేడు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కేటీఆర్ కు  కాబోయే సీఎం కేటీఆర్ కు స్వాగతం అంటూ మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్ర ఆచార్య ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.చాలాకాలం తర్వాత మళ్లీ కేటీఆర్ సీఎం అనే నినాదం తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube