ఏపీలో 2023-24 సంవత్సరానికి గానూ మొదటి విడత వైఎస్ఆర్ లా నేస్తం నగదును విడుదల చేసింది సర్కార్ .ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి అర్హులైన లాయర్ల ఖాతాల్లో నగదు జమ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,667 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేశారు.ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నెలకు రూ.5 వేల చొప్పున ప్రతి వ్యక్తికి రూ.25 వేలను వారి ఖాతాల్లోకి వేశారు.లాయర్లకు అండగా ఉండే లక్ష్యంతో వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.కాగా ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 5 వేల 781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది.







