ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం .గొలుగొండ మండలం జోగంపేట గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు నిన్న ఉదయం నుంచి సరదాగా మద్యం సేవిస్తూ గడిపారు.
సరదా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.సాయంత్రం తాండవ రిజర్వాయర్ మధ్యలో ఉన్న కొండపై ఇంకా మరింత తాగుదామని వెళ్లారు.
అయితే తిరిగి వచ్చే సమయంలో బోటు తిరగబడి బల్లంకి చిన్న అనే వ్యక్తి గల్లంతయ్యారు మిగిలిన నలుగురు వ్యక్తులను రిజర్వాయర్లలో చేపలు పడుతున్న సత్తిబాబు అనే జాలరి గమనించి నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు .అయితే ప్రమాదవశాత్తు జరిగిందా మరి ఏ విధంగా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు ఇప్పటికే బోటును గుర్తించారు మృతదేహం ఇంకా కానరాలేదు.గోల్కొండ ఎస్సై ధనంజయ నాయుడు స్వయంగాను,గజ ఇతగాళ్ళు తోను స్థానిక జలరీలతోను వెతుకుతున్నారు







