ఓవర్ యాక్షన్ చేస్తే అంతే సంగతులు ! సోషల్ మీడియా పై నిఘా నేత్రం ?

సోషల్ మీడియా వాడకం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది.తమ భావాలను, అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ను ఉపయోగించుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఏ విధంగా , వ్యక్తిగత దూషణలకు దిగుతూ, మత, హింస పెరిగే విధంగా కామెంట్స్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.సోషల్ మీడియా ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితుల్లో, పోలీసులు దీనిపై కేసు పెట్టారు.

సోషల్ మీడియా పై పూర్తిగా నిఘా పెంచారు.ఇకపై పెట్టే సోషల్ మీడియాలో పోస్టింగ్ కానీ , చేసే కామెంట్స్ లో ఏవైనా అసభ్య పదాలు ఉంటే వెంటనే పోలీసులకు తెలిసిపోతుంది .ముఖ్యంగా సెర్చ్ చేసే కీబోర్డ్ లో అసభ్య పదాలు, చైల్డ్ పోర్న్ కంటెంట్, టెర్రరిస్ట్ కంటెంట్ సెర్చ్ చేస్తే వెంటనే ఆ కీవర్డ్స్ ఆధారంతో ఆటో మిషన్ ద్వారా మీ పూర్తి వివరాలు నిఘా వర్గాలకు చేరే విధంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.అలాగే ఎవరైనా ఫేక్ న్యూస్ ప్రచారం చేసినా,  మహిళలు పెట్టే ఫోటోలకు అసభ్యకరంగా కామెంట్ చేసిన, ఇకపై కఠిన చర్యలు తప్పవు.

ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిన నేపథ్యంలో ఎవరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో తెలుసుకునేందుకు అవకాశం ఉండడంతో,  ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధం అవుతోంది.వ్యక్తులు వ్యవస్థలకు భంగం కలిగేలా పోస్టులు పెడితే ఊరుకోబోమని హెచ్చరికలు చేస్తున్నారు.

Advertisement

ఇకపై ఎవరైనా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే, దానికి ఆధారాలు లభిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2008 లోని సెక్షన్ 66డి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, 2005 లోని సెక్షన్ 54, ఇండియన్ పీనల్ కోడ్, 1860 లోని 153, 499, 500, 505 (1) సెక్షన్ ప్రకారం వారు భారత చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారని కేంద్రం ప్రకటించింది.

వ్యక్తిపై అనవసర నిందలు , వ్యంగ్య వ్యాఖ్యలు, తప్పుదోవ పట్టించే కంటెంట్ ప్రచారం చేయడం,  మోసపూరిత కంటెంట్, కంటెంట్ సృష్టించి రాయడం, వ్యక్తిపై నిందలు మోపడం,విపత్తుల పై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం,  ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే వార్తలు ప్రచారం చేస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 24 ప్రకారం శిక్షార్హులు అవుతారు.

Advertisement

తాజా వార్తలు