సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల్లో చాలామంది తమ ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిలో గొబ్బెమ్మలను ఉంచడం ఆనవాయితీగా వస్తోంది.ఈ గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారు చేస్తారు అందువల్ల ఈ సంక్రాంతికి ఆవుపేడకి డిమాండ్ పెరిగిపోయింది.
అందుకే గ్రామాల నుంచి నగరాల్లోకి తీసుకువచ్చిన ఆవు పేడ హాట్ కేకుల్లా గంటల్లో అమ్ముడవుతోంది.ప్రస్తుతం సంక్రాంతి సంబరాలకు గొబ్బెమ్మల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు నల్గొండకి వచ్చి రోడ్డు పక్కన పేడను విక్రయిస్తున్నారు.
కాగా ఈ ఆవు పేడకు చాలా డిమాండ్ నెలకొంది.నల్గొండలో మహిళలు కొద్దిపాటి ఆవు పేడను రూ.30 నుంచి రూ.40కి విక్రయిస్తూ బాగా సొమ్ము చేసుకుంటున్నారు.వారు తెచ్చిన ఆవు పేడ పట్టణంలోకి ఇలా వచ్చీ రావడంతోనే అది అమ్ముడుపోయిందట.నల్గొండలో ఆవు పేడ విక్రేతలు శుక్రవారం నుంచి ప్రతిరోజూ దాదాపు 10 కిలోల ఆవు పేడను చాలా సమయంలోనే అమ్మేస్తున్నారట.

సంక్రాంతి రోజున అంటే ఆదివారం నాడు ఈ స్వచ్ఛమైన ఆవు పేడకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉండవచ్చని, తాను తెచ్చిన పేడ జస్ట్, రెండు గంటల్లోనే అమ్ముడుపోయిందని ఒక మహిళ అన్నారు.ఇంతటి డిమాండ్ తాను ఊహించలేదని పేర్కొన్నారు.ఈ రోజుల్లో పట్టణాలు, నగరాల్లో ఆవు పేడను పొందడం చాలా కష్టం.సిటీలో ఎక్కడా కూడా ఆవులు కనిపించవు.సిటీకి దూరంగా ఉన్న ఆవుల వద్దకు వెళ్లాలంటే రవాణా ఖర్చు ఎంతో కొంత అవుతుంది.అంత శ్రమ ఎందుకని చాలామంది రోడ్ల పక్కన అమ్ముతున్న వారి దగ్గరే పేడ కొనేస్తున్నారు.
సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతిని జరుపుకోవడానికి రోడ్డు పక్కన అమ్మే ఆవు పేడ మీదే చాలామంది ఆధారపడుతున్నారు.అందుకే వీటికి ఎంత డిమాండ్.







