జనవరి నుండి టీవీ చూడాంలే జేబులు ఖాళీ అవ్వాల్సిందే... కొత్త కేబుల్‌ విధానం, సామాన్యులకు పెను భారం

డీటీహెచ్‌ ఆపరేటర్లు మనం ఎంచుకున్న ప్యాకేజీని బట్టి మన వద్ద డబ్బులు వసూళ్లు చేస్తారు.వినియోగదారులు హెచ్‌ డీ ఛానెల్స్‌ను ఎంచుకుంటే ఒక రేటు, సాదారణ ఛానెల్స్‌ను ఎంచుకుంటే మరో రేటు ఉంటుంది.

 From January Dish Tv Charges Hikes The Particular Dish Tv Owners-TeluguStop.com

అయితే కేబుల్‌ ఆపరేటర్లు మాత్రం ఇలా విడి విడిగా రేట్లు పెట్టరు.నెలకు ఇంత అంటూ ఫిక్డ్స్‌ రేటు ఉంటుంది.

ఎన్ని ఛానెల్స్‌ వీలుంటే అన్ని ఛానెల్స్‌ను సదరు కేబుల్‌ ఆపరేటర్లు ఇస్తారు.అయితే ఇకపై కేబుల్‌ ఆపరేటర్లు కూడా విడి విడిగా ఛానెల్స్‌కు డబ్బు వసూళ్లు చేసేలా రంగం సిద్దం అయ్యింది.

ఇప్పటి వరకు వందల కొద్ది ఛానెల్స్‌ను కేబుల్‌లో ప్రసారం చేసినా కూడా నామమాత్రపు ధరను మాత్రమే వసూళ్లు చేసేవారు.కాని ఇప్పుడు మాత్రం వంద ఛానెల్స్‌కు మించి ఛానెల్స్‌ కోరుకునే వారు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.ఇప్పటికే కేబుల్‌ ఆపరేటర్లకు ఈ విధమైన స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

కొన్ని నెట్వర్క్‌ సంస్థలకు చెందిన వారు ఇప్పటికే రేట్లను ఫిక్స్‌ చేశారు.ఆ రేట్ల ప్రకారం జనవరి 1 నుండి కేబుల్‌ వినియోగదారులు కూడా భారీగా చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ప్రస్తుతం రెండు వందల యాబై ఛానెల్స్‌ను 200 రూపాయలను ఎంజాయ్‌ చేస్తున్న వారు, కొత్త విధానం వల్ల దాదాపు వంద నుండి నూటయాబై రూపాయల వరకు ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం ఉంటుందట.కోరుకున్న ఛానెల్స్‌ చూడాంటే ఇకపై వినియోగదారులు పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే.

ఇప్పటి వరకు డీటీహెచ్‌ వినియోగదారులు ఎలా అయితే చెల్లించారో ఇకపై కేబుల్‌ వినియోగదారులు కూడా అదే విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.అందుకే ఇకపై కొన్ని ఛానెల్స్‌ను మాత్రమే వినియోగదారులు ఎంపిక చేసుకోవడం మంచిది.తెలుగు వారు అన్ని తెలుగు ఛానెల్స్‌ను చూడాలంటే కనీసం మూడు వందల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అందుకే తెలుగు చానెల్స్‌లో కొన్ని ఛానెల్స్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది.మొత్తానికి ఇకపై స్వేచ్చగా టీవీని కూడా చూసే పరిస్థితి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube