టీడీపీతో బీజేపీ దోస్తీ.. ఇదేం ట్విస్ట్ ?

రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో ఊహించడం కష్టం.అవసరానికి తగినట్లుగా మిత్రుత్వం కలుపుకోవడం, ఆ తరువాత శతృత్వం పెంచుకోవడం పాలిటిక్స్ లో సర్వ సాధారణమే.

అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేదా శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని చెబుతుంటారు విశ్లేషకులు.ఇక అసలు విషయంలోకి వేస్తే 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో చెట్టపట్టాలేసుకొని తిరిగి ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ.

.( TDP ) సరిగ్గా ఎన్నికల సమయానికి బీజేపీతో దోస్తీని తెగతెంపులు చేసుకొని ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది.

బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు బీజేపీ పై, మోడీ సర్కార్ పై చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు.

Friendship Of Chandrababu With Bjp.. Same Twist, N. Chandrababu Naidu, Tdp, Bjp
Advertisement
Friendship Of Chandrababu With BJP.. Same Twist?, N. Chandrababu Naidu, Tdp, Bjp

ఇక అప్పటి నుంచి టీడీపీకి దూరం పాటిస్తూ చంద్రబాబును ( N.Chandrababu Naidu )అసలు కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదు బీజేపీ పెద్దలు.అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే 2014 కూటమి ఒక్కటే మార్గమని భావించిన చంద్రబాబు.

అప్పటి నుంచి మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చారు.కానీ బీజేపీ మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీతో కలవడానికి ససేమిరా అంటూ వచ్చింది.

కానీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పట్టు కోసం అన్నీ పార్టీలు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కాషాయ పార్టీ ఏపీలో బలపడాలంటే ఏదో ఒక పార్టీతో జట్టు కట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే బీజేపీకి ఏపీలో సొంత బలం లేని దుస్థితి.

Friendship Of Chandrababu With Bjp.. Same Twist, N. Chandrababu Naidu, Tdp, Bjp

ప్రస్తుతం జనసేన( JanaSena Party )తో పొత్తులో ఉన్నప్పటికి టీడీపీతో కలిస్తేనే ఆధిక్యం పెరిగే అవకాశం ఉంది.అందుకే బీజేపీ( Bjp )ముందు కూడా టీడీపీతో కలవడం తప్పా వేరే దారి కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో జులై 18 న బీజేపీ పెద్దలతో వివిధ పార్టీలు ఎన్డీయే చేరికలపై సమావేశం జరపనున్నాయి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఈ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఒకవేళ ఈ ఎన్డీయే సమావేశానికి చంద్రబాబు హాజరయితే మళ్ళీ టీడీపీ ఎన్డీయే కూటమిలో భాగం కావడం ఖాయమనే చెప్పాలి.

Advertisement

గత కొన్నాళ్లుగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే నిజం అయ్యేలా కనిపిస్తోందని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

తాజా వార్తలు