సాధారణ పెన్నుల గురించి అందరికీ తెలిసిందే.అందరూ రాసేవే.
అయితే జనాలకు తెలియని పెన్నులు( Pens ) చాలా రకాలు వున్నాయి మార్కెట్లో.అందులో ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ రాయగలితే పెన్నులు.
ఇక ఇలాంటి పెన్నులు ఉంటే ఎంత బావున్ను అని ఒకప్పటి జనం అనుకునేవారు.ఎందుకంటే ఒకప్పటి ప్రేమకథలు ఇప్పటిలాగా కాదు… గోడలపై, చెట్లపై, బల్లలలపై మొదలయ్యేవి.
ఉదాహరణకు మనం ఏదైనా స్కూలికి వెళ్ళినపుడు అక్కడ మనకు అనేక కధలు కనిపిస్తాయి.అదేవిధంగా పార్క్‌కు వెళ్ళినపుడు కూడా అక్కడ గోడలపై, చెట్లపై లవర్స్ పేర్లు కనబడుతూ ఉంటాయి.
శ్రీను లవ్ శృతి అనో, రవి వెడ్స్ రేవతి అనో ఇలా వాళ్లు వాళ్ల ప్రేయసి పేరును రాళ్లతో తెగ చెక్కేసుకొనేవారు.
ఆఖరికి తిరుమల స్టెప్ప్స్ పై వెళ్లేప్పుడు కూడా ఆ గోడలపైన ఇలాంటి పేర్లు తెగ రాసేశారు.
ఇలా ప్రేమను చాటుకోవడానికి ప్రేమికులు( Lovers ) ఇలాంటి మార్గాలను బాగా ఎంచుకొనేవారన్నమాట.అయితే సాధారణంగా చెట్లపై, బల్లలపై, గోడలపై పేర్లు చెక్కడం అంటే చాలా కష్టం.
కానీ ఇపుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక క్రియేటివ్ పెన్ను మార్కెట్లోకి వచ్చేసింది.ఇక దీంతో మీరు చెక్కపైన, మెటల్‌పైన, నగలపైన కూడా హ్యాపీగా మీ పేరును, మీ ప్రియమైన వారి పేరును రాసుకోవచ్చన్నమాట.
ఈ పెన్ అసలు లవర్స్ కోసమే చేశారా అన్నట్లు ఉంటుంది.ఇది FreshDcart బ్రాండ్ నుంచి వచ్చిన పవర్ ఎంగ్రేవింగ్ పెన్.( Power Engraving Pen ) దీని ద్వారా కలప, గ్లాస్ వంటి వాటిపై పేర్లను, డిజైన్లను చెక్కవచ్చు.

అంతేకాకుండా దీనితో నగలు, గ్లాస్‌పై కూడా మీకు ఇష్టమైన పేర్లను చెక్కేందుకు వీలుగా ఎక్స్‌ట్రా టూల్ నిబ్ ఇస్తున్నారు. చైనాలో( China ) తయారైన ఈ పెన్ బరువు 100 గ్రాములు, పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు ఉంటుందని తెలిపారు.మనం పెన్నుని ఎలా పట్టుకుంటామో అలాగే దీనికి పట్టుకొని వాడాలి.
బొటనవేలి దగ్గర చిన్న కంట్రోల్ బటన్ ఉంటుంది.దాన్ని నొక్కడం ద్వారా పెన్ పనిచేస్తుంది.
ఎవరికైనా గిఫ్టుగా ఇచ్చేందుకు ఈ పెన్ చాలా బాగుంటుంది.

ఈ పెన్నుతో కలప, గ్లాస్, ఇతర పాత్రలపై చెక్కడం ద్వారా మీలో క్రియేటివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.లవర్స్ ఏదైనా గిఫ్టుగా ఇచ్చుకునేటప్పుడు.పేర్లను ఈ పెన్నుతో చెక్కి ఇస్తే.
ఆ టాలెంట్ అవతలివారికి ఎప్పటికీ గుర్తుంటుంది.అదేవిధంగా దీనితో ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్స్, కాలిక్యులేటర్స్, మాగ్నిఫైయింగ్ గ్లాసెస్, పెన్స్, మెటల్స్, జువెలరీపై కూడా మీకు నచ్చిన పేర్లను చెక్కవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.దీని అసలు ధర రూ.499 కాగా.అమెజాన్‌లో దీనిపై 50 శాతం డిస్కౌంట్ ఉంది. రూ.249కి అమ్ముతున్నారు.