మహిళలకు ఉచితం సరే: మరి వీరి సంగతేమిటి?

రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం అనేక హామీలు ఇస్తూ ఉంటాయి.వాటి సాధ్యసాధ్యలు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చనే ధీమాతోనే సాధారణంగా పార్టీలు హామీలకు తెరతీస్తాయి.

 Free For Women Is Fine : So What About Them, Karnataka , Free Bus Travel ,rs-TeluguStop.com

అయితే ఒక్కసారి అదికారం లోకి వచ్చిన తర్వాత ,అధ్యయనం చేసిన తర్వాత వాటి అమలు ఎంత కష్టమో ఆయా పార్టీలకు అర్థమవుతూ ఉంటుంది .తెలంగాణలో మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం అన్నది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు కీలకమైన హామీలలో ఒకటిగా ఉంది .ముఖ్యంగా కర్ణాటక( Karnataka )లో ఇప్పటికే అమలు అవుతూ ఉండటంతో తెలంగాణలో కూడా కచ్చితంగా అమలు చేస్తారన్న అంచనాలతో చాలామంది మహిళలు కాంగ్రెస్కు ఓటు వేసినట్లుగా అంచనాలు ఉన్నాయి.అయితే ఇప్పుడు గత రెండు రోజులుగా ఈ పథకం అమలు అవుతున్నప్పటికీ దీని తాలూకు పర్యవసానాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ఒక కీలకమైన పర్యవసానాన్ని ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకువచ్చారు.

Telugu Auto Drivers, Congress, Bus Travel, Karnataka, Rahul Gandhi, Revanth Redd

ఉచిత బస్సు ప్రయాణం( Free bus travel ) వల్ల ఇప్పటికే నష్టాల్లోకునారిల్లుతున్న ఆర్టీసీ నెత్తిపై మరో పెద్ద గుడిబండ వేస్తున్నట్లు అవుతుందని, దీని తాలూకు ఆర్థిక భారాన్ని ప్రభుత్వం ఏ విధంగా బర్తి చేస్తుందో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ఆయన, తెలంగాణలో ఆటో నడుపుతూ పొట్ట పోసుకొనే కుటుంబాలు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయని, వీరు గ్రామాలనుంచి పట్టణాలకు వచ్చి రేకుల షెడ్డుల్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ పొట్ట పోసుకుంటున్నారని ఇప్పుడు అలాంటి వారందరికీ ప్రభుత్వ నిర్ణయం శరాగాతంగా తగిలిందని, అందువల్ల ప్రభుత్వం దీని వల్ల వచ్చే కష్టనష్టాలను సమూలంగా అధ్యయనం చేసి దీనివల్ల నష్టపోతున్న అన్ని వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Auto Drivers, Congress, Bus Travel, Karnataka, Rahul Gandhi, Revanth Redd

విద్యార్థినులకు, ఉద్యోగినిలకు ఈ నిర్ణయం ఉపయోగకరంగానే ఉన్నప్పటికీ ఆర్థికంగా ప్రభుత్వంపై అదనపు భారాన్ని ఎలా సరి చేస్తారు అన్నది కూడా పెద్ద పజిల్ గా మారింది.దీర్ఘకాలంలో ఈ పథకం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని రవాణా పై ఆధారపడిన అనేక వ్యవస్థలకు, సంస్థలకు ఇది తీరని నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి .మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube