భారతీయ విద్యార్ధులకు ఫ్రాన్స్( France ) శుభవార్త చెప్పింది.కొత్త విద్యా కార్యక్రమం కింద భారతీయ పూర్వ విద్యార్ధులకు ఐదేళ్ల షెంజెన్ వీసాను( Schengen Visa ) ఫ్రాన్స్ అందించనుంది.2030 నాటికి భారతదేశం నుంచి 30,000 మంది విద్యార్ధులను ఆహ్వానించడమే తమ లక్ష్యమని ఫ్రాన్స్ మంగళవారం ప్రకటించింది.సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడంతో పాటు రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని బలపరచుకోవడం తమ లక్ష్యమని పేర్కొంది.
గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పారిస్ పర్యటన సందర్భంగా జరిగిన చర్చలు, ఒప్పందాలకు అనుగుణంగా భారతీయ విద్యార్ధులు, పూర్వ విద్యార్ధులకు రెడ్ కార్పెట్ వేసేలా ఫ్రాన్స్ కొత్త కార్యక్రమాలను ప్రకటించింది.
ఈ మేరకు భారత్‌లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం.
( French Embassy ) కొత్త విద్యా కార్యక్రమం వివరాలను తెలియజేసింది.ఒక భారతీయ విద్యార్ధి ఫ్రాన్స్‌లో కేవలం ఒకే ఒక్క సెమిస్టర్‌ను గడిపినా దానికి గౌరవం లభించాలని పేర్కొంది.
మాస్టర్స్ డిగ్రీ , అంతకంటే ఎక్కువ డిగ్రీని కలిగి వుండి.ఫ్రాన్స్‌లో కనీసం ఒక సెమిస్టర్ చదివిన భారతీయ విద్యార్ధులు ఐదేళ్ల ‘‘ షార్ట్ స్టే షెంజెన్ వీసా’’కు అర్హులని రాయబార కార్యాలయం వెల్లడించింది.
భారతీయ పూర్వ విద్యార్ధులు ఫ్రాన్స్, ఫ్రెంచ్ సహచరులతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి ఈ వీసా దోహదం చేస్తుందని రాయబార కార్యాలయం పేర్కొంది.

భారతీయ విద్యార్ధులకు( Indian Students ) ప్రయోజనం చేకూర్చేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్,( Emmanuel Macron ) ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) పారిస్‌లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి మా బృందాలు రెట్టింపు పనిచేస్తున్నాయని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ అన్నారు.ఫ్రాన్స్ ఎల్లప్పుడూ భారతీయ విద్యార్ధులకు స్నేహితుడిగా వుంటుందని, మీరు మా దేశంలో అద్భుతమైన జీవితాన్ని పొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కాగా.2030 నాటికి 30,000 వేల మంది భారతీయ విద్యార్ధులను ఆహ్వానించాలనే ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటనలో భాగంగా భారత్‌లోని ఫ్రెంచ్ ఎంబసీ, ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్‌లు ‘Choose France Tour 2023’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.ఫ్రెంచ్ ప్రభుత్వం, క్యాంపస్ ఫ్రాన్స్ నిర్వహించే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ చెన్నై (అక్టోబర్ 8), కలకత్తా (అక్టోబర్ 11), ఢిల్లీ (అక్టోబర్ 13), ముంబై (అక్టోబర్ 15)లలో నిర్వహించబడుతుంది.








