తెలంగాణ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.ఈ మేరకు ఫాక్స్ కాన్ కంపెనీ ముందుకు వచ్చింది.
హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో ఫాక్స్ కాన్ కంపెనీ సీఈఓ యంగ్ లియు సమావేశం అయ్యారు.కాగా కొంగర్ కలాన్ లో సుమారు 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటు చేయనుంది ఫాక్స్ కాన్.
ఇందులో భాగంగా సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా తమ పెట్టుబడి ఉండనుందని యంగ్ లియు తెలిపారు.







