రోజురోజుకు సమాజంలో దారుణాలు ఎక్కువైపోతున్నాయి.ఇందులో కొన్ని ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉంటాము.
ఆర్మీలో ఉద్యోగాలు( Jobs in Arm ) ఇప్పిస్తామంటూ కొందరు ఉద్యోగార్థుల నుండి భారీగా డబ్బులను కాజేసి వారిని చిత్రహింసలు పెడుతున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఉద్యోగార్థుల నుండి డబ్బులు తీసుకుని వారిని పశువుల వలె హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ విషయాన్నీ ఘటన ఇప్పుడు పశువుల వలె హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ ( Founder of Indian Army Calling Institute )ఘటన ఇప్పుడు సంచనలంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ వ్యవస్థాపకుడు బసవ రమణ( Basava Ramana ) ఉద్యోగాల కోసం వచ్చిన వారిని శారీరకంగా హింసించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

బసవ రమణ చేతిలో పదుల సంఖ్యలో కాకుండా వేలాదిమంది విద్యార్థులు బాధితులుగా ఉన్నట్లు సమాచారం.ఇలా ఉద్యోగాల కోసం వచ్చిన వారిని చిత్రహింసలు పెడుతూ వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వీడియోని విడుదల చేశారు.ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీ లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర నుండి ఐదు నుంచి పది లక్షల వరకు వసూలు చేసి చిత్ర హింసలు చేస్తున్నారు.

ఈ విషయంలో చాలా సీరియస్ గా ఎలాగైనా యాక్షన్ తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ చేశాడు మనోజ్ కుమార్ అనే యువకుడు.పోస్టులోని వీడియోలో విద్యార్థులను బసవ రమణ మోకాళ్ళపై కూర్చోబెట్టి ఒక వ్యక్తిని కేబుల్ వైర్ తో అతి దాస్టికంగా కొడుతుండడం కనిపిస్తోంది.మొత్తానికి ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు అతనిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.ముందు ముందు ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







