నెల్లూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలను ఖండించిన అనిల్ కుమార్ యాదవ్.
వైసిపి ప్రభుత్వాన్ని పీకేసేంత సత్తా నీకు లేదని తెలుసుకో పీకె.నువ్వు చంద్రబాబు దత్తపుత్రుడివని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.మీరందరూ కట్టకట్టుకుని వచ్చినా 2024 లో విజయం వైసీపీదే.
2024 ఎన్నికలలో విజయం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేస్తాం.సినిమాలతో పాటు చంద్రబాబు స్ర్కిప్ట్ లకు కూడా నటించే నిన్ను జనం నమ్మరు.ముందు నువ్వు పోటీ చేసే సీటు గెలిచేందుకు ప్రయత్నించు.అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట తిరగడం మానుకోండి.ఆయన సీఎం అవ్వడం ఓ కలగానే మిగిలిపోతుంది.