అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్( Donald Trump ) అందరికీ సుపరిచితుడే.ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత భారత్ అమెరికా బంధం ఊహించని విధంగా బలోపేతం అయింది.
అంతకుముందు అమెరికాకి అధ్యక్షులుగా ఉన్నవాళ్లు పాకిస్తాన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు.కానీ ట్రంప్ హయాంలో ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవటంతో భారత్ విషయంలో చాలా సానుకూలంగా వ్యవహరించారు.
తర్వాత జరిగిన ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది.ఇప్పుడు మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇటువంటి పరిస్థితులలో శృంగార తార స్టార్మీ డేనియల్స్( Stormy Daniels ) కేసు అక్రమ చెల్లింపుల కేసు విచారణలో డోనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు.

కొద్దిసేపటి క్రితం న్యూయార్క్( New York ) కోర్ట్ ఎదుట నిండిపోయిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు.మరోపక్క ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందని ట్రంప్ లాయర్లు చెబుతున్నారు.ఇదిలా ఉంటే అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ విమర్శల పాలయ్యారు.2006వ సంవత్సరంలో శృంగార తార స్టార్మీ డేనియల్స్ తో శృంగారంలో పాల్గొన్నరు.కాగా డోనాల్డ్ ట్రంప్ ఇది చెప్పకూడదని.2016 అధ్యక్ష ఎన్నికల అప్పుడు ట్రంప్ తనకి డబ్బులు ఇచ్చినట్లు స్టార్మీ డేనియల్స్ తెలిపారు.అయితే ఆమెకి ఇచ్చిన డబ్బులను వ్యాపార ఖర్చుగా ట్రంప్ చూపించి రికార్డులలో తప్పుడు లెక్కలు చూపించినట్లు కేసు నమోదు అయింది.
అయితే ఈ కేసులో నేడు కోర్టు ఎదుట ట్రంప్ లొంగిపోయారు.చాలా వరకు ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందని ట్రంప్ లాయర్లు చెబుతున్నారు.







