ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులతో కలిసి అరుణాచలం బయలు దేరారు.దైవదర్శనం తరువాత వారంతా ఢిల్లీకి పయనం కానున్నారని తెలుస్తోంది.
పొంగులేటి వెంట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యతో పాటు పలువురు నేతలు ఉన్నారు.అయితే పొంగులేటి కొత్త పార్టీ పెడతారా? లేక బీజేపీ జాతీయ నేతలను కలిసేందుకు హస్తినకు వెళ్తున్నారా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.పొంగులేటి ఢిల్లీ పర్యటనపై హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు.అయితే తన రాజకీయ అడుగు ఏటువైపు అనే దానిపై ఉగాది పండుగ నాటికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.







