ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) ఇటీవల చేపట్టిన టిక్కెట్ల మార్పు చేర్పుల వ్యవహారం తరువాత ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు అసంతృప్తితో టిడిపిలో చేరిపోయారు.టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నవారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇలా కొంతమంది తమకు టిక్కెట్ దక్కలేదనే అసంతృప్తితో పార్టీ మారారు.
ఈ విధంగా ఇటీవల కాలంలో టిడిపిలోకి వలసలు జోరందుకోవడంతో, ఆ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది.అయితే టిడిపిలోనూ ఈ అసంతృప్తి జ్వాలలు కనిపిస్తున్నాయి.
వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ ఉండడమే దీనికి కారణంగా ఈ ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ, పార్టీని నిలబెడుతున్న వారిని పక్కన పెట్టి, కొత్తగా వచ్చి చేరిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వంటివి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి.

ఇదేవిధంగా నూజివీడు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు( Muddaraboina Venkateswararao ) వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.గత కొద్దిరోజులుగా ఆయన టిడిపి అధిష్టానం పై తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.ఇటీవల వైసిపి నుంచి టీడీపీలో చేరిన పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి( Kolusu Parthasarathy ) నూజివీడు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించడంతో తనకు అన్యాయం జరిగిందంటూ ముద్రబోయిన వెంకటేశ్వర రావు గతి కొద్ది రోజులుగా మీడియా సమావేశం నిర్వహిస్తూ, తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఇంతకాలం పార్టీ కోసం తానే ఎంతగానో కష్టపడ్డానని, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి కోసం తనను పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ముద్రబోయిన ఆవేదన చెందుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.నిన్న సాయంత్రం జగన్ తో ముద్రబోయిన భేటీ అయ్యివైసీపీలో చేరే విషయమై చర్చించినట్టు సమాచారం.