మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్( Former MLA Aroori Ramesh ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( BRS KCR ) తో సమావేశం అయ్యారు.తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు.
వార్తలు వస్తున్నట్లు తాను అమిత్ షా( Amit Shah ) ను కలవలేదని వెల్లడించారు. అదేవిధంగా తమ పార్టీ నేతలతో కలిసి వచ్చానని తెలిపారు.
అయితే ఈ ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నివాసం వద్ద హైడ్రామా జరిగిందన్న విషయం తెలిసిందే.బీఆర్ఎస్ ను వీడి ఆయన బీజేపీలో( BJP ) చేరతారంటూ ప్రచారం జోరుగా సాగింది.
అయితే ఈ వార్తలకు తెర దించుతూ మాజీ ఎమ్మెల్యే ఆరూరి తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.