వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని( perni nani ) జనసేన పార్టీపై సెటైర్లు వేశారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు.
పవన్ తన జనసేన పార్టీని చంద్రబాబుకి లాంగ్ లీజ్ కి ఇచ్చేశారు అంటూ.సెటైర్లు వేశారు.
శుక్రవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.జగన్ నీ ఓడించి చంద్రబాబుకి అధికారాన్ని కట్టబెట్టడమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ అని అన్నారు.
చంద్రబాబు రాజకీయ మనుగడే పవన్ లక్ష్యమని వ్యాఖ్యానించారు.
తాను నాలుగు సంవత్సరాల కిందటే.చెప్పానని…పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్థాపించింది రాజకీయ పార్టీ కాదు ఒక టెంట్ హౌస్.ఇప్పుడు చంద్రబాబుకి పవన్ తన టెంట్ హౌస్ పార్టీని.
లాంగ్ లీజ్ కి ఇవ్వడం జరిగింది అంటూ విమర్శించారు.పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులంతా తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు.
అక్కడే వాళ్ళకి ఓటు హక్కు ఉంది.కానీ రాజకీయాలు మాత్రం ఏపీలో చేస్తుంటారని పేర్ని నాని మండిపడ్డారు.
నేను జగన్ చచ్చినా మా సేవలు ఏపీలోనే పాతి పెడతారు.వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు.
ఆరు నూరైనా వచ్చే ఎన్నికలలో మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.