రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పై నాయకులు, ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.
చిలకలూరిపేటలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి పత్తిపాటి మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలు ఘోరంగా పెంచారని…పల్లె వెలుగు, సిటీ సర్వీసులు చార్జీలు భారీగా పెంచారన్నారు.డీసెల్ సెస్ పేరుతో ఎడాపెడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను బాదుతున్నారు అని తెలియజేశారు.
రాష్ట్రంలో మద్యం,ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డి దే అన్నారు.రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించ వలసిన ముఖ్యమంత్రి మాట తప్పి, సొంత పార్టీ వారినే మోసం చేస్తున్నట్లు తెలిపారు.
మూడు వందల యూనిట్ల కరెంటు దాటితే అమ్మఒడి క్యాన్సిల్ చేస్తున్నారని ….ఇవి నవరత్నాలు….కావని…నవ మోసాలు అని పత్తిపాటి సీఎంపై విమర్శనాస్త్రాలు సంధించారు.ఇప్పటికైనా కరెంట్ కోతలు ప్రకటించి కరెంట్ చార్జీల బాదుడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించాలని కోరారు.
కరెంట్ కోతలు ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని పత్తిపాడు డిమాండ్ చేశారు.సెల్ఫోన్లో లైట్ వెలుగులో ఆపరేషన్లు జరుగుతున్నాయని వెంటనే కరెంట్ కోతలు లేకుండా చేయాలని పత్తిపాటి కోరారు.
క్యాబినెట్ కూర్పుపై మాజీ మంత్రి పత్తిపాటి మాట్లాడుతూ గత క్యాబినెట్లో ఏ శాఖలో ఎవరున్నారో జగన్మోహన్ రెడ్డి కి తెలియదని, ఎప్పుడైనా సమీక్షలు పర్యటనలు చేశారా అని ప్రశ్నించారు.టిడిపిలో 110 మంది ఎమ్మెల్యేలకు తొమ్మిది మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామన్నారు.
ప్రస్తుతం 151 మంది వైసిపి లో ఉన్న కేవలం 11 మంది బీసీలకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారన్నారు విద్యాశాఖ మంత్రి లేకుండా సీఎం జగన్ సమీక్ష జరపటం ఏమిటని అన్నారు.ఇప్పుడు ఉన్న మంత్రులకు అధికారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.? కార్పొరేషన్ చైర్మన్ లకు చైర్ కరువైందని పత్తిపాటి సీఎం జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారని ప్రభుత్వాన్ని తరిమితరిమి కొడతారని తెలిపారు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉందని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఆయన జోస్యం చెప్పారు.
ఈ మీడియా సమావేశంలో టిడిపి నాయకులు దాసరి రాజా మాస్టారు, కరిముల్లా, అజారుద్దీన్, నెల్లూరు సదాశివరావు తదితరులు పాల్గొన్నారు…
.






