మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్ చంద్రబాబు కుప్పం పర్యటన నేపద్యంలో ఆందోళనలు చేయకుండా ముందస్తు చర్యలు.ఆనంద బాబు ఇంటికి పెద్ద సంఖ్య లో చేరుకున్న పోలీసులు మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఆందోళన.

 Former Minister Nakka Ananda Babu's House Arrest ,former Minister Nakka Ananda B-TeluguStop.com

ఆనంద బాబు ను అడ్డుకున్న పోలీసులు.మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన.

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ని ఇంటినుండి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.ఎందుకుబయటకు వెళ్ళనియ్యారని పోలీసులను ప్రశ్నించిన ఆనంద్ బాబు.

రోడ్డుపైనే ఉండి నిరసన వ్యక్తం చేసిన ఆనంద్ బాబు,అంబేద్కర్ సాక్షిగా జీవో నెం1 ని దగ్ధం చేసిన ఆనంద్ బాబు.జీఓ లను తగలబెట్టిన టిడిపి నేతలు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కామెంట్స్:కొంతమంది పోలీసు అధికారులును చూసి బాధపడే పరిస్థితి ఏర్పడింది.పోలీసులు కూడా మాకు ఏమిటి ఈ కర్మ అంటూ బాధపడుతున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలు కూడా ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని బాధపడుతున్నారు చీకటి జీవోను విడుదల చేసి ప్రతిపక్ష నాయకులు మీద కక్ష తీర్చుకొనేందుకు ఇలాంటివి చేస్తున్నారు.1861పోలీస్ యాక్ట్ పేరుతో జీవో నెంబర్1 తెచ్చి ఆనందం పొందుతున్నారు రాష్ట్రంలో11మంది టీడీపీ కార్యకర్తలు మరణానికి కారణం వైసీపీ అసమర్ధ పాలననే…తక్షణమే జీవో నెం1 ఉపసంహరంచేసుకోవాలి అంబేద్కర్ సాక్షిగా నీ పతనం మొదలయింది.కుట్ర ప్రకారం చంద్రబాబు పర్యటన లో అలజడి సృష్టించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నావు.

ప్రజలలో నుంచి వ్యతిరేక ఉప్పెన రాబోతుంది ఆ ఉప్పెనకు మీరు కొట్టుకుపోక తప్పదని హెచ్చరించారు.రాష్ట్రంలో విలువలు లేకుండా ప్రజా పాలన సాగుతోందని విమర్శించారు

జగన్ దోపిడీలు, నవమోసాలు, నేరాల్ని కప్పిపుచ్చే కుట్ర జిఓ నెం.1రోడ్డుషోలు, సభల ద్వారా పెంచిన పన్నులు, చార్జీలు, దోపిడీలు, నవమోసాలు బయటపడతాయనే భయంతో జిఓఆర్టీ-01ను జగన్ తీసుకొచ్చారుఇందుచేత రాష్ట్రాన్ని కాపాడగలిగేది చంద్రబాబు గారేనని ఆయన రోడ్డు షోలకు ప్రజలు స్వచ్చందంగా, తండోపతండాలుగా వస్తున్నారు జగన్ బలవంతపు సభలు వెలవెలబోతున్నాయి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ రోడ్ షోలకు బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత చట్టప్రకారం జగన్ ప్రభుత్వంపై ఉన్నది జగన్ , వారి తల్లి, చెల్లి, తండ్రి పాదయాత్రలకు చంద్రబాబు ప్రభుత్వం భద్రత కల్పించింది జగన్ పాదయాత్రల్లో 8మంది చనిపోయినా వారి పాదయాత్రలను చంద్రబాబు ప్రభుత్వం నిలుపుదల చేస్తూ అక్రమ జిఓలు జారీచేయలేదు జి.ఓ.నెం.1 జారీచేశారంటే జగన్ కి ప్రజాస్వామ్యంపైన, ప్రజలపైన నమ్మకం లేదని రుజువు అవుతున్నది స్టేట్ టెర్రరిజం అమలుచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు 1861 చట్టం వచ్చిన తర్వాత కూడా 1930లో గాంధీజీ దండియాత్ర చేశారు బ్రిటిష్ ప్రభుత్వం కూడా గాంధీజీ దండియాత్రను నిలుపుదల చేయలేదు జీఓ 1 లో చెబుతున్న పోలీసుయాక్ట్ 1861 లో వచ్చింది జగన్ బ్రిటిష్ ప్రభుత్వం కన్నా దుర్మార్గంగా కుప్పంలో ప్రతిపక్షనేత రోడ్డుషోను అడ్డుకున్నారు కుప్పం ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube