తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి( BRS Former Minister Malla Reddy ) కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి( Marri Rajasekhar Reddy ) భేటీ అయ్యారు.బెంగళూరులోని ఓ హోటల్ లో శివకుమార్ తో మల్లారెడ్డి మంతనాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ( Priyanka Gandhi )ని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారని సమాచారం.ఈ నేపథ్యంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు కాంగ్రెస్( Congress ) కండువా కప్పుకోనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.