Gollapalli Surya Rao : వైసీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు( Gollapalli Surya Rao ) వైసీపీ గూటికి చేరారు.టీడీపీకి( TDP ) రాజీనామా చేసిన ఆయన సీఎం జగన్( CM Jagan ) సమక్షంలో వైసీపీలో చేరారు.

 Gollapalli Surya Rao : వైసీపీలో చేరిన మాజీ మ-TeluguStop.com

ఈ క్రమంలో ఆయనకు కండువా కప్పిన సీఎం జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.అయితే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా పార్టీ అధిష్టానం రాజోలు నియోజకవర్గ టికెట్ ను( Rajolu Constituency Ticket ) జనసేనకు కేటాయించింది.

దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన గొల్లపల్లి టీడీపీ హైకమాండ్ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడారు.అయితే రాజోలు నియోజకవర్గంలో ఇంతకముందు జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ ఇప్పటికే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.తాజాగా గొల్లపల్లి కూడా వైసీపీలో( YCP ) చేరారు.దీంతో రాజోలు వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎవరి పేరును ఖరారు చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube